హైదరాబాద్: సన్నీ లియోన్... యువతకు పరిచయం అక్కర్లేని పేరు. దేశ వ్యాప్తంగా ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి సన్నీ లియోన్ కూడా ఒకరికి వీరాభిమాని. తాజాగా ట్విట్టర్‌లో సన్నీ లియోన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సన్నీ లియోన్ #AskSunny పేరిట లైవ్ చాట్‌లో ఈ విషయాన్ని చెప్పింది.
మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. చాలా మంది మాదిరి క్రికెట్ లవర్స్ చెప్పినట్టు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లను ఆమె చెప్పలేదు. టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్ ధోని తన అభిమాన క్రికెటర్ అని చెప్పింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో ధోని ఫామ్‌లో లేపోయినప్పటికీ, ధోని పట్ల ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదనీ సన్నీ స్పష్టంచేసింది. ఈ సీజన్‌లో ఇటీవలే కమెడియన్ సునీల్ గ్రోవర్‌తో కలిసి సన్నీ లియోన్ ఐపీఎల్ కామెంటరీ ఇచ్చిన సంగతి తెలిసిందే.