గేల్ వర్సెస్ సన్నీలియోన్: సవాళ్లు, ఇద్దరి డ్యాన్స్ సూపర్బ్(వీడియో)
ముంబై: వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ విసిరిన ఛాలెంజ్‌ను బాలీవుడ్ నటి సన్నీ లియోన్ స్వీకరించింది. సన్నీ లియోన్.. షారుక్ ఖాన్ సినిమాలో చేసిన పాట 'లైలా మై లైలా..' పాటకు క్రిస్ గేల్ తన డ్యాన్స్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే.
A post shared by KingGayle 👑 (@chrisgayle333) on
ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ చేస్తోంది. తనలా డ్యాన్స్ అదరగొడితే తాను 5000 డాలర్లు నగదు బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. కాగా, గేల్ ఛాలెంజ్‌కు ఏకంగా సన్నీ లియోనే రంగంలోకి దిగింది. తాను గేల్ ఛాలెంజ్‌కి సిద్ధమేనంటూ ప్రకటించింది.
అంతేగాక, తాను డ్యాన్స్ చేసిన వీడియోను, గేల్ డ్యాన్స్ చేసిన వీడియోను జత చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 'క్రిస్ గేల్ డ్యాన్స్ ఛాలెంజ్‌కు ఇదే నా ఎంట్రీ' అని ట్వీట్ చేసింది సన్నీ.
'రయీస్' సినిమాలో సన్నీలియోన్ చిందేసిన పాటకు డ్యాన్స్ చేసిన గేల్ ఆ వీడియోను ఇటీవల పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోతో గేల్ ఛాలెంజ్ విసిరితే.. ఇప్పుడు సన్నీ తన వీడియోతో ప్రతి సవాల్ విసిరింది. మరి గేల్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications