క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడుకున్నా ప్రపంచకప్ విజేతగా నిలిచాడు!

హైదరాబాద్: ఏ క్రికెటర్ అయినా తమ కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచకప్ టోర్నీ ఆడాలని కలలు కంటాడు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టును విశ్వవిజేతగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే చాలా మంది ఆటగాళ్లకు ఈ అవకాశం దక్కకపోవచ్చు. కానీ ఓ క్రికెటర్ మాత్రం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ ముద్దాడటం అతని అదృష్టమో లేక అవకాశాలు రాక బెంచ్‌కే పరిమితమవ్వడం దురదృష్టమో.. కానీ క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఆటగాడిగా నిలిచిపోయాడు.

1983 వరల్డ్‌కప్ విన్నర్..

1983 వరల్డ్‌కప్ విన్నర్..

ఇక అతనెవరో కాదు. మన భారత మాజీ క్రికెట్ సునీల్ వాల్సన్. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు గెలిచిన 1983 ప్రపంచకప్ జట్టులో అతను సభ్యుడు. 14 మంది సభ్యుల టీమ్‌లో 13 మంది కనీసం 2 మ్యాచ్‌లైనా ఆడగా, వాల్సన్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఎడంచేతి వాటం మీడియం పేసర్‌ అయిన వాల్సన్‌ మైదానంలోకి దిగకపోయినా విన్నింగ్‌ టీమ్‌ సభ్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.

ఒక్క అవకాశం కూడా రాలేదు..

ఒక్క అవకాశం కూడా రాలేదు..

అయితే ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే వాల్సన్‌కు వరల్డ్‌ కప్‌లోనే కాదు... అంతకుముందు, ఆ తర్వాతా ఒక్క వన్డే ఆడే అవకాశం రాలేదు. సరిగ్గా చెప్పాలంటే అతను భారత్‌ తరఫున టెస్టులతో సహా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇలాంటి క్రికెటర్‌ వాల్సన్‌ ఒక్కడే కావడం విశేషం. పదేళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల తరఫున ఆడి అతను 212 వికెట్లు పడగొట్టాడు. ఇక రణ్‌వీర్ సింగ్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న 83 మూవీలో వాల్సన్ పాత్రను టీవీ యాక్టర్ బద్రీ పోషిస్తున్నాడు.

నన్నేం పక్కన పెట్టలేదు కదా..

నన్నేం పక్కన పెట్టలేదు కదా..

ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమైనా బాధపడ్డారా? అని వాల్సన్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని బదులిచ్చాడు. ‘ప్రపంచకప్‌లో మిగతా 13 మందికి వచ్చిన అవకాశం తను ఒక్క మ్యాచ్‌లో కూడా రాలేదని ఏ మాత్రం బాధపడలేదు. ఎందుకంటే అప్పుడు నేను యువ ఆటగాడిని. ప్రపంచకప్ విన్నింగ్ మెంబర్స్ 14 మందే అంటున్నారు. కానీ ఆడలేదని నన్నేం పక్కన పెట్టలేదు కదా.'అని వాల్సన్ ఎదురు ప్రశ్నించాడు.

అవకాశం వచ్చినట్టే..

అవకాశం వచ్చినట్టే..

ఇక 1983 ప్రపంచకప్‌ టోర్నీలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని వాల్సన్ గుర్తు చేసుకున్నాడు. ‘వెస్టిండీస్‌తో సెకండ్ లీగ్ మ్యాచ్ అనుకుంటా. ఆ మ్యాచ్‌లో పేసర్ రోజర్ బిన్నీ అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. బిన్ని ఫిట్‌నెస్ టెస్ట్ విఫలమైతే రెడీగా ఉండాలని కపిల్ దేవ్ నాతో అన్నాడు. కానీ ఆ మ్యాచ్‌లో బిన్నీనే బరిలోకి దిగాడు. మూడు వికెట్లు కూడా తీసాడు. కానీ భారత్ ఆ మ్యాచ్‌లో ఓడింది. అయితే నాకు అవకాశం రాలేదని నేనింతవరకు ఎవరిని నిందించలేదు. నాకు కూడా మ్యాచ్ ఆడాలని ఉండేది. కానీ జట్టు సమతూకంగా ఉన్నప్పుడు ఎవరూ ఏం చేయలేరు. ఎవరైనా బెస్ట్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాలనుకుంటారు. అయినా ఆ టోర్నీలో ప్రతీ మూమెంట్‌ను నేను ఆస్వాదించా'అని వాల్సన్ చెప్పుకొచ్చాడు.

ఆ మాటలే భారత క్రికెట్ తలరాతను మార్చాయి: మాజీ క్రికెటర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 5, 2020, 16:51 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X