
అసలు నరైన్ అందుకున్న రికార్డు ఏమిటి?
ఐపీఎల్‌లో గత పది సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సునీల్ నరైన్. ఈ క్రమంలో 10 సీజన్లకు నరైన్‌కు కోల్‌కతా యాజమాన్యం చెల్లించిన మొత్తం వేతనం అక్షరాల 95.6 కోట్ల రూపాయలు. అంతేకాకుండా రాబోయే సీజన్‌కు కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ నరైన్‌ను రిటైన్ చేసుకుంది. ఇందుకుగాను అతనికి నైట్‌రైడర్స్ యాజమాన్యం 6 కోట్ల రూపాయలను చెల్లించనుంది. దీంతో ఐపీఎల్‌లో నరైన్ వేతనం 100 కోట్ల రూపాయలకు చేరుకోనుంది. దీంతో ఐపీఎల్‌లో 100 కోట్ల రూపాయలు అందుకున్న విదేశీ ప్లేయర్‌గా సునీల్ నరైన్ రికార్డు సృష్టించనున్నాడు. అంతేకాకుండా ఈ జాబితాలో 100 కోట్ల రూపాయలు అందుకున్న రెండో విదేశీ ప్లేయర్‌గా నరైన్ నిలవనున్నాడు. కాగా ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్‌తోపాటు ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యార్‌ను కూడా రిటైన్ చేసుకుంది. ఇందుకుగాను కోల్‌కతా యాజమాన్యం రసెల్‌కు 12 కోట్ల రూపాయలు, వరుణ్‌కు 8 కోట్ల రూపాయలు, అయ్యర్‌కు 8 కోట్ల రూపాయలు చెల్లించనుంది.

నరైన్ కంటే ముందు అతడే
ఈ జాబితాలో సునీల్ నరైన్ కంటే ముందు విదేశీ ప్లేయర్ల జాబితాలో సౌతాఫ్రికాకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిలియర్స్ మాత్రమే ఉన్నాడు. డివిలియర్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 102.5 కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే ఓవరాల్‌గా మాత్రం నరైన్ ఆరో స్థానంలో ఉన్నాడు. నరైన్, డివిలియర్స్ కంటే ముందు నలుగురు భారత ప్లేయర్లు ఉన్నారు. అత్యధికంగా 152.8 కోట్ల రూపాయలతో ధోనీ మొదటి స్థానంలో ఉండగా.. 146.6 కోట్ల రూపాయలతో రోహిత్ శర్మ రెండో స్థానంలో.. 143.2 కోట్ల రూపాయలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో.. 110.7 కోట్ల రూపాయలతో సురేష్ రైనా నాలుగో స్థానంలో ఉన్నాడు.

సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్
ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌లాడిన ఈ వెస్టిండీస్ ప్లేయర్ 6.74 ఏకానమీతో 143 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటర్‌గా 954 రన్స్ చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటర్‌గా అనేకసార్లు కోల్‌కతాకు మంచి ఆరంభాలు ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












