Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నరైన్ అదో టైప్.. టీమ్ మీటింగ్స్‌కు రాడు- శ్రేయస్

ఐపీఎల్-2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఆరింట్లో నెగ్గి 12 పాయింట్లో టాప్-2లో నిలిచింది. ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి ముందంజలో ఉంది.

టాస్ ఓడినప్పటికీ మొదట బంతి చేపట్టిన కేకేఆర్ ఢిల్లీని స్వల్ప స్కోరుకే కట్టడిచేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (35; 26 బంతుల్లో, 5x4, 1x6), రిషభ్ పంత్ (27; 20 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్లు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లుతో (3/16)తో సత్తాచాటాడు. హర్షిత్ రాణా (2/28), వైభవ్ అరోరా (2/29) చెరో రెండు వికెట్లు తీశారు.

Sunil Narine does not attend team meetings- Shreyas Iyer

అనంతరం ఛేదనకు వచ్చిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో, 7x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (33*; 23 బంతుల్లో, 3x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (26*; 23 బంతుల్లో, 2x4, 1x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

కాగా, మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తక్కువ స్కోరు నమోదు కావడానికి పిచ్ కారణం కాదని, తమ బౌలర్ల ప్రతిభం అని తెలిపాడు. బంతితో సత్తాచాటిన వరుణ్ చక్రవర్తి, బ్యాటుతో చెలరేగిన ఫిల్ సాల్ట్‌ను శ్రేయస్ కొనియాడాడు. సునీల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ భిన్నమైన వ్యక్తి అని, మీటింగ్స్‌కు కూడా హాజరవ్వడని నవ్వుతూ చెప్పాడు.

''గత మ్యాచ్‌ల్లో ఇక్కడ సగటు స్కోరు 200గా నమోదైంది. అయితే పవర్‌ప్లే తర్వాత వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. పిచ్ స్వభావంపై మాకో స్పష్టత వచ్చింది. అంతేగాక తొలుత బౌలింగ్ చేయడం కలిసొచ్చింది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు ఓపెనర్లతో జరిగే మీటింగ్‌కు సునీల్ నరైన్ హాజరవ్వడు. అతడు రావొద్దని సలహా ఇస్తా (నవ్వుతూ)''

''ఫిల్ సాల్ట్ మాత్రం జట్టు సమావేశాలకు వస్తాడు. సాల్ట్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌ల్లో ఆశించినంత రాణించలేకపోయాడు. కానీ ఇవాళ ఒత్తిడిలో అతడు గొప్పగా ఆడాడు. మేం ఆది నుంచి ప్లేఆఫ్స్‌కు త్వరగా అర్హత సాధించాలే భావిస్తున్నాం. పాయింట్ల పట్టికలో మా స్థానం గురించి పట్టించుకోవట్లేదు'' అని శ్రేయస్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 30, 2024, 9:10 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+