Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బంతితో పాటు బ్యాటుతోనే అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన నరైన్ 40 సగటుతో 286 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక బంతితోనూ నరైన్ సత్తాచాటాడు. ఏడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

కేకేఆర్‌కు మెంటార్‌గా గంభీర్ బాధ్యతలు అందుకోవడం నరైన్‌కు కలిసొచ్చింది. నరైన్ తిరిగి ఓపెనర్‌‌గా బరిలోకి దిగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 39 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. దీంతో మరో నెల రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ జట్టులో నరైన్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని నరైన్‌కు విజ్ఞప్తులు మొదలయ్యాయి.

Sunil Narine Accepts Decision Regarding Retirement Aims to Avoid Disappointment

దీనిపై తాజాగా సునీల్ నరైన్ స్పందించాడు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని, తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టలేనని చెప్పాడు. తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని, స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌ను వెస్టిండీస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ''రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని రాబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలని ప్రజలు కోరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నా రిటైర్మెంట్ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నాను. నిరాశ చెందాలనుకోవట్లేదు. ఆ తలుపులు మూసివేశాం''

''వెస్టిండీస్ తరఫున జూన్‌లో బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు నా మద్దతు ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఎంతో శ్రమిస్తున్న వాళ్లు.. మా అద్భుతమైన అభిమానుల కోసం మరో టైటిల్‌ను అందించడానికి అర్హులని భావిస్తున్నా. ఆల్ ది బెస్ట్'' అని నరైన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, మిగిలిన మ్యాచ్‌లన్నీ కరేబియన్ దీవుల్లో జరగనున్నాయి.

Story first published: Tuesday, April 23, 2024, 13:02 [IST]
Other articles published on Apr 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+