
నాకది వర్కౌట్ అయింది
టాపార్డర్లో తనను బ్యాటింగ్ చేయించడంతో తాను బ్యాటింగ్ విషయంలో మరింత ఆత్మవిశ్వాసం పొందానని సునీల్ నరైన్ నరైన్ చెప్పాడు. 'గౌతమ్ గంభీర్ నన్ను ఓపెన్ చేయాలని అడిగాడు. నేను నా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించాలని అతను నాకు చెప్పేవాడు. నేను త్వరగా నా వికెట్ కోల్పోయినా పర్వాలేదు. నేను ఓపెనర్ పాత్రకు కొత్త కాబట్టి ఎవరూ నా కోసం పెద్దగా ప్లాన్స్ వేసి ఉండరు. పైగా ఓ బౌలర్ అయి ఉండడంతో నన్ను తొలుత అంత సీరియస్‌గా ఎవరూ తీసుకోలేదు. కానీ నేను బలాన్ని, శక్తిని ఉపయోగించి హిట్ చేసేవాడిని. అది వర్కౌట్ అయింది. నేను అంత బాగా రాణిస్తాననే విషయం కేకేఆర్ కెప్టెన్ గంభీర్ నన్ను ఓపెనర్‌గా, టాపార్డర్ బ్యాటర్‌గా పంపేవరకు తెలీదు. నాపై అంత నమ్మకాన్ని గంభీర్ కలిగి ఉండడం నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది' అని నరైన్ క్రికెట్ మంత్లీలో పేర్కొన్నాడు

ఆ లీగ్‌లలో కూడా ఓపెనర్‌గా
ప్రస్తుతం సునీల్ నరైన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR), బిగ్ బాష్ లీగ్ (BBL)లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ రెండు జట్ల తరఫున కూడా అతను ఓపెనింగ్ చేయడం గమనార్హం. కేకేఆర్లో ఓపెనర్‌గా అతనికి అవకాశం వచ్చాకే ఆయా టోర్నీల్లో అతనికి ఓపెనర్ స్థానం దక్కింది. అక్కడ తాను సక్సెస్ ఫుల్ అయ్యాడు. సునీల్ నరైన్ కుదురుకుంటే భీకరంగా ఆడతాడనే విషయం ఐపీఎల్ అభిమానులకు తెలిసిందే.

సునీల్ నరైన్ గణాంకాల విషయానికొస్తే..
ఇటీవల అతను టీ20 బ్లాస్ట్ 2022 ఎడిషన్‌లో సర్రే జట్టు తరఫున ఆడి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక గణాంకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు 419 టీ20 మ్యాచ్‌లు సునీల్ నరైన్ ఆడాడు. అతను 15.36సగటుతో 148.23 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. ఓవరాల్‌గా 3196పరుగులు చేశాడు. అందులో 13హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతను బౌలింగ్లో 12సార్లు నాలుగు వికెట్ల హాల్ తీశాడు. ఒకసారి ఐదు వికెట్ల హాల్ తీశాడు. మొత్తంగా 452 టీ20 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications
