Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దెబ్బపడింది... వైభవ్ విషయంలో గవాస్కర్ చెప్పిందే నిజమైందిగా!

Vaibhav Suryavanshi: రీసెంట్ గా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సుల మోత మోగిస్తూ సెన్సేషనల్ సెంచరీ చేసిన 14ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్)పై ప్రతిఒక్కరూ ప్రశంసల వర్షం కురిపించారు. కానీ దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్‌ గావస్కర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. అయితే తాజా మ్యాచులో నిజంగానే గవాస్కర్ చెప్పినట్టే జరగడం గమనార్హం.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గవాస్కర్‌ మాట్లాడుతూ.. "వైభవ్ వేలంలోకి వచ్చేసరికి..అతడు యూత్‌ టెస్టులో ఆస్ట్రేలియాపై శతకం బాదాడు. ఇది గొప్ప ప్రదర్శనే. 13 ఏళ్ల వయసులో ఓ అంతర్జాతీయ జట్టుపై సెంచరీ బాదడం పెద్ద విషయమే. అయితే అతడిలో ఇంకా టాలెంట్‌ ఉంది. ఇంకా అతడు తన ఆటను డెవలప్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద్రవిడ్‌ నేతృత్వంలో అతడు మరింత సానపడతాడు. అతడిని ఇప్పుడే ప్రశంసలతో ఆకాశానికి ఎత్తకూడనేది నా భావన. పైగా అతడు ఆడిన మొదటి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌ బాదాడు. అంటే అనుభవజ్ఞులైన బౌలర్లు ఇప్పుడు అతడిని చూసి. ' మళ్లీ తొలి బంతికే సిక్స్‌ కొడతాడేమో' అని భావించి షార్ట్ లెంగ్త్‌తో బంతిని సంధిస్తారు. దీంతో వైభవ్‌ ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు అతడు ఆందోళనకు గురై.. అతిగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఏదేమైనా టీ20 మ్యాచులో 50 లేదా 60 పరుగులు చేసినా గొప్పే. అతడు ఈ స్థాయిలో సెంచరీ చేయడం అసాధారణమైన విషయమే." అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Sunil Gavaskar s Advice Proven Right says not overpraise Vaibhav Suryavanshi

గవాస్కర్ చెప్పినట్టుగానే...
అయితే గవాస్కర్‌ చెప్పినట్టుగానే.. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచులో వైభవ్‌ విఫలమయ్యాడు. ఓపెనర్‌గా దిగిన అతడు తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్‌ గా వెనుదిరిగాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్ లో ఫుల్‌ డెలివరీని షాట్‌ బాదేందుకు ప్రయత్నించి మిడ్‌ఆన్‌లో ఉన్న ఫీల్డర్‌ చేతికి చిక్కాడు.

ఏం కాదులే..
వైభవ్‌ ఔటవ్వగానే.. ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్‌ శర్మ స్పోర్ట్ మ్యాన్‌షిప్ ప్రదర్శించాడు. వైభవ్ దగ్గరకు వచ్చి.. ఏమీ కాదంటూ భుజం తట్టి మద్దతుగా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ ప్రోత్సాహించిన తీరును ప్రశంసిస్తున్నారు.

Story first published: Friday, May 2, 2025, 11:31 [IST]
Other articles published on May 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+