న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్‌సీబీ మ్యాచ్ విన్నర్ అతనే.. ఆ ఇద్దరు ఓపెనర్లుగా రావాలి: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar wants Virat Kohli and AB de Villiers to open for RCB

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు రాణించాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను ఓపెనర్లుగా ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ సీజన్‌లో ఆర్‌సీబీ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలకం కానున్నాడని జోస్యం చెప్పాడు. నెమ్మదైన పిచ్‌లు గల యూఏఈలో స్పిన్నర్లు ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన ఎక్స్‌పర్ట్ కాలమ్‌లో పేర్కొన్నాడు.

ఇదే మంచి ఆలోచన..

ఇదే మంచి ఆలోచన..

‘యూఏఈలో నెమ్మదైన పిచ్‌లు ఎక్కువ కాబట్టి ఆర్‌సీబీ సూపర్ బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీ, ఏబీడీలను ఓపెనర్లుగా ఆడించడం మంచి ఆలోచన. బంతి గట్టిగా కొత్తగా ఉండటంతో సులువుగా బ్యాట్‌పైకి వస్తుంది. అయితే స్పిన్ బౌలింగ్‌లో మాత్రం ఇలా జరగకపోవచ్చు. కాబట్టి పవర్ ప్లేను ఉపయోగించుకోవాలి. అలా జరగాలంటే కోహ్లీ, ఏబీడితో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించాలి. ఈ తరహా పిచ్‌లపై ఆర్‌సీబీ తరఫున చహల్ మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది.'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఆర్‌సీబీ సమస్యదే..

ఆర్‌సీబీ సమస్యదే..

ఇక వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్న ఆర్‌సీబీ గత 12 సీజన్లుగా టైటిల్ గెలవకపోవడం తనను ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు. ‘ఆర్‌సీబీ వంటి బలమైన జట్టు ఇంకా టైటిల్ గెలవకపోవడమనేది సాధించలేని పజిల్‌గా ఉంది. కోహ్లీ, డివిలియర్స్‌ ఉన్న ఏ జట్టు స్కోర్ కూడా తక్కువగా ఉండకూడదు. అదే వాళ్లకు సమస్యగా మారి ఉండవచ్చు. వారిద్దరూ విఫలమైతే.. ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం లేదు. ప్రతీసారి వాళ్లు రాణించడం కష్టమే. ఈ ఏడాది వారికి కొత్త కోచ్ వచ్చాడు. ఈ సారైనా ఆ జట్టు రాత మారాలని ఆశిద్దాం'అని గవాస్కర్ రాసుకొచ్చాడు.

టైటిలే లక్ష్యంగా..

టైటిలే లక్ష్యంగా..

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్ గేల్, డేల్ ‌స్టెయిన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. గత మూడు సీజన్లలో ప్రదర్శన ఏమాత్రం బాలేదు. 2019లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి సీజన్‌ను ఎలా ముగిస్తుందో చూడాలి. ఈ నెల 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోహ్లీ సేన తలపడనుంది.

ఆ తీవ్రత ఏమాత్రం తగ్గదని కోహ్లీ అనే నేను హామీ ఇస్తున్నా.!

Story first published: Friday, September 18, 2020, 11:01 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X