
కోహ్లీ నాయకత్వంలోనూ వీరిద్దరూ కీలక పాత్ర
2011 వరల్డ్ కప్‌ను అందించిన వీరిద్దరూ కోహ్లీ నాయకత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. 'కోహ్లీసేన ప్రస్తుతం వరుస విజయాలతో ఊపు మీద ఉంది. కానీ మిడిలా ఆర్డర్ మాత్రం ఒత్తిడికి లోనవుతోంది. ధోనీ, హార్దిక్ పాండ్, మనీష్ పాండే, కేదార్ జాదవ్‌లతో ఇప్పటికే ప్రయోగాలు చేశారు. వీరు రాణిస్తున్నారు. కానీ కొన్నిసార్లు మాత్రం చివరి ఓవర్లలో ధోనీ, కోహ్లిపై ఒత్తిడి పెరిగిపోతోంది' అని గవాస్కర్ చెప్పాడు.

ఓపెనర్లు విఫలమైతే.. మిడిలార్డర్ ఒత్తిడికి లోనవుతోంది
రహానే ఓపెనర్‌గానే రాణిస్తున్నప్పటికీ... మిడిలార్డర్‌లో ఆడటంలో విఫలం అవుతున్నాడని గావస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 'ఓపెనర్లు విఫలమైతే.. మిడిలార్డర్ ఒత్తిడికి లోనవుతోంది. జట్టులో శిఖర్ ధావన్ మాత్రమే ఎడమ చేతి వాటం ఆటగాడు. మిగతా వాళ్లంతా కుడి చేతి వాటం బ్యాట్స్‌మెనే' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

యువీ, రైనాలు మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణిస్తారు
'దీంతో వైవిధ్యం దెబ్బతింటోంది. యువీ, రైనాలు మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణిస్తారు. ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడతారు. రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన రెండో టీ20 చూడండి. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 40-50 పరుగులు తక్కువ చేసింది. ఓ ఎండ్‌లో కోహ్లీ ఆడుతున్నా మరోవైపు నుంచి సహకారం కొరవడింది' అని తెలిపాడు.

వీరిద్దరూ బంతితోనూ రాణించగలరు
'అదే యువీ, రైనాల్లో కనీసం ఒక్కరున్నా పరిస్థితి మెరుగ్గా ఉండేది. తిరువనంతపురంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లోనూ మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉంటే బాగుండేది. ప్రస్తుతం జట్టులో మిడిలార్డర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దానిని ఎడమ చేతి వాటం ఆటగాళ్లయిన యువీ, రైనాలు భర్తీ చేయగలరు. అంతే కాదు వీరిద్దరూ బంతితోనూ రాణించగలరు. ఇది తాత్కాలిక పరిష్కారమే కావచ్చు. కానీ నిలకడగా రాణించే ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ మాత్రం అవసరం' అని గవాస్కర్ అన్నాడు.


Click it and Unblock the Notifications











