Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ అపాయింట్‌మెంట్‌పై టీమిండియా మాజీల రియాక్షన్: ఒక్కొక్కరు ఒక్కోలా

 Sunil Gavaskar, Virender Sehwag, Ajay Jadeja reacts after Dravid appointed as Team India Coach
Rahul Dravid ఉంటే ప్లేయర్స్ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు - Virender Sehwag || Oneindia Telugu

ముంబై: ఊహించినట్టే భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితుడయ్యాడు. టీమిండియా మాజీ బ్యాటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్.. ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నాడు. ఈ నెల 15వ తేదీన కోచ్‌గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. టీమిండియా న్యూజిలాండ్ పర్యటన అతని ఫస్ట్ టాస్క్. రాహుల్ ద్రవిడ్ నియామకం అనేది ఏకగ్రీవంగా ముగిసింది. అతను తప్ప మరెవరూ ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీనితో పోటీ లేకుండా హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు ద్రవిడ్.

 14న ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం

14న ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం

దీపావళి పండగకు ఒక్క రోజు ముందే బీసీసీఐ.. అతని నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. ఆ వెంటనే రాహుల్ ద్రవిడ్.. అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ తరువాత టీమిండియా- న్యూజిలాండ్‌కు పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఈ సిరీస్‌ టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ బాధ్య‌త‌లు చేపడతారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ద్ర‌విడ్ ఉన్నారు.

లంక పర్యటనకు కోచ్‌గా..

లంక పర్యటనకు కోచ్‌గా..

ఇదివరకు రాహుల్ ద్రవిడ్.. శ్రీలంకలో పర్యటించిన వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 టీమ్‌కు హెడ్ కోచ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ల జట్టు అయిదు టెస్ట్ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా.. శిఖర్ ధవన్ కేప్టెన్సీలో మరో టీమ్ శ్రీలంకలో పర్యటించింది. లంకేయులతో మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌ సిరీస్‌ను ఆడింది. ఇందులో టీ20ల్లో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పని చేయనున్నారు.

స్పందించిన మాజీలు..

స్పందించిన మాజీలు..

రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడు కావడం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. అతని హయాంలో టీమిండియాకు మరింత ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జోస్యం చెబుతున్నారు. అన్ని ఫార్మట్లలోనూ ఆరితేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో టీమిండియా ప్లేయర్లు మెరికల్లా తయారవుతారని స్పష్టం చేస్తున్నారు. ద్రవిడ్.. తన అనుభవాన్ని రంగరించి జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాడనడంలో సందేహాలు అక్కర్లేదని అంటున్నారు.

బ్యాటింగ్ లెజెండ్స్..

బ్యాటింగ్ లెజెండ్స్..

టీమిండియా బ్యాటింగ్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా.. వంటి పలువురు స్పందించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని సునీల్ గవాస్కర్ అన్నారు. జట్టు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని చెప్పారు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ద్రవిడ్‌కు ఉందని, దాన్ని జట్టు కోసం ధారపోస్తాడని వ్యాఖ్యానించారు. రాహుల్ ద్రవిడ్ క్రమశిక్షణ గల క్రికెటర్ అని కితాబిచ్చాడు.

ప్లేయర్ల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది..

ప్లేయర్ల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది..

రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం.. జట్టు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన ఎదురుగా కూర్చుని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని ద్రవిడ్.. ప్లేయర్లకు కల్పిస్తాడని, అలాంటి వాతావరణం డ్రెస్సింగ్ రూమ్‌లో ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. డెడికేషన్, డిసిప్లిన్.. ఈ రెండింటికీ రాహుల్ ద్రవిడ్ అధిక ప్రాధాన్యత ఇస్తాడని అజయ్ జడేజా పేర్కొన్నాడు. భారత జట్టు తిరుగులేని విజయాలను సాధించడానికి ఈ రెండూ చాలా అవసరమని వ్యాఖ్యానించాడు.

Story first published: Thursday, November 4, 2021, 14:18 [IST]
Other articles published on Nov 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+