68వ పడిలోకి సన్నీ: సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సోమవారం 68వ పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. ఈ సందర్భంగా గవాస్కర్‌కు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ గవాస్కర్‌ని అభిమానులు ముద్దుగా 'సన్నీ' అని పిలిచే సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గవాస్కర్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భారత్ తరుపున గవాస్కర్ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. 1971 మార్చిలో విండిస్‌పై తొలి టెస్టు ఆడిన గవాస్కర్ 1987 మార్చిలో పాకిస్థాన్‌పై చివరి టెస్టు ఆడాడు.
1974 జులైలో ఇంగ్లాండ్‌పై తొలి వన్డే ఆడిన గవాస్కర్ 1987 నవంబరులో అదే ఇంగ్లాండ్ జట్టుతో చివరి వన్డే ఆడాడు. ఇదిలా ఉంటే టెస్టు క్రికెట్‌లో పది వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా గవాస్కర్‌కు పేరుంది. 1971లో విండిస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఏకంగా 774 పరుగులు చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్
‘ఎంతో గొప్ప, ధైర్యవంతమైన బ్యాట్స్‌మెన్ సునీల్ గావస్కర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ‘మాలామాల్' సినిమా ద్వారా మీలో మరో కోణం చూశాం' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
శిఖర్‌ధావన్
‘భారత క్రికెట్ దిగ్గజం మిస్టర్ సునీల్ గవాస్కర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా' అని శిఖర్‌ధావన్ ట్వీట్ చేశాడు.
బీసీసీఐ
‘క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కి జన్మదిన శుభాకాంక్షలు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఐసీసీ
‘ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ సునీల్ గావస్కర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 233 మ్యాచ్(టెస్టు, వన్డే)ల ద్వారా ఎంతో విలువైన 13,214 పరుగులు సాధించావు' అని ఐసీసీ ట్వీట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications