
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా ఫామ్‌లేమి సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. తరచూ ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చే బంతులను వేటాడి మరి ఔట్ అవుతున్నాడు. దీంతో కోహ్లీ కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికీ, బ్యాటర్‌గా రాణించలేకపోతున్నాడు. కోహ్లీ ఫామ్‌పై టీమ్ మెనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్.. కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. తాజాగా ఓ క్రీడా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీల్ గవాస్కర్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కోహ్లీ ఫోన్ చేసి అతని నుంచి సలహా తీసుకోవాలని సూచించాడు. దానికి ఈ నూతన సంవత్సరాన్నే వేదికగా ఎంచుకోవాలని తెలిపాడు. నూతన సంవత్సరం రోజు సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపి తన బలహీనతను అధిగమించడానికి సలహా అడిగితే అద్భుతంగా ఉంటుందని సన్నీ చెప్పుకొచ్చాడు.
నిజానికి 2003-2004 ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడని తెలిపాడు. మూడో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్‌లో వెళ్లే బంతికి ఔటయ్యాక ఇక మళ్లీ అలాంటి షాట్లు ఆడనని సచిన్ చెప్పాడని గవాస్కర్ గుర్తు చేశాడు. అన్నట్టుగా సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ సైడ్ ఆవలగా వచ్చే బంతులను వదిలేసి మిడ్ ఆఫ్, స్ట్రెయిట్, ఆన్‌సైడ్ షాట్లు మాత్రమే ఆడాడని తెలిపాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులతో నాటౌట్ నిలిచిన విషయాన్నిగుర్తు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే ఫామ్ కొనసాగించి 60 పరుగులతో అజేయంగా నిలిచాడని చెప్పాడు. తద్వారా మ్యాచ్‌తోపాటు సిరీస్ కూడా 1-1తో డ్రా అయిన విషయాన్ని గవాస్కర్ నెమర వేసుకున్నాడు.
నిజానికి కోహ్లీ బ్యాటింగ్‌లో అంతగా లోపాలు లేవని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కానీ దురదృష్టవాత్తు తరచూ ఆఫస్టంప్ బంతులకు ఔట్ అవుతున్నాడని అన్నాడు. క్రికెట్‌లో ప్రతి ఆటగాడు తప్పులు చేస్తుంటాడని, అయితే కొందరు క్యాచ్‌లు జారిపోవడంతో బతికి పోతుంటారని, కానీ దురదృష్టవశాత్తూ కోహ్లీకి అలాంటి అవకాశాలు రావడం లేదని చెప్పాడు. కొత్త సంవత్సరంలో కనుక కోహ్లీ తన బలహీనతను అధిగమిస్తే అతని నుంచి మరిన్ని సెంచరీలు చూడొచ్చు అన్నాడు. కాగా సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆఫస్టంప్ బంతులకే ఔట్ అయ్యాడు.