రేపటి నుంచి మహా సమరం ప్రారంభం కానుంది. జూన్ 2న నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో యూఎస్‌ఏలో అడుగుపెట్టింది.
అయితే ప్రత్యర్థితో కంటే జట్టు కూర్పుతోనే భారత్ ఎక్కువగా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. గాయాల నుంచి కోలుకుని రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య తిరిగి రావడంతో జట్టు బలోపేతంగా మారడంతో పాటు గందరగోళంగా ఏర్పడింది. అంతేగాక ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కొందరు ఫామ్ కోల్పోవడం ఆందోళనకరంగా మారింది.

అయితే సూపర్-8 మ్యాచ్‌లు జరిగే వెస్టిండీస్ పిచ్‌లపై సమతూకమైన బౌలింగ్ దళంతో భారత్ బరిలోకి దిగాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. శివమ్ దూబె, హార్దిక్ పాండ్య తుదిజట్టులో ఉండాలని పేర్కొన్నాడు. హార్దిక్‌ను బ్యాకప్ పేసర్ ఆప్షన్‌గా ఉపయోగించుకోవాలని తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా తుది జట్టు ఎంపిక చేయాలని అన్నాడు.
''వెస్టిండీస్‌లో మన బౌలింగ్ ఎటాక్ సమతూకంగా ఉండాలి. కాబట్టి భారత్ మూడు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలి. హార్దిక్ పాండ్య బ్యాకప్ పేసర్‌గా ఉండాలి. అప్పుడే జట్టు బ్యాలెన్సింగ్ ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా అనుభవజ్ఞులు, యువతతో గొప్పగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు యువ ప్లేయర్లు యశస్వీ జైస్వాల్, శివమ్ దూబె, రిషబ్ పంత్‌తో జట్టు బలోపేతంగా ఉంది'' అని గవాస్కర్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.