కోన్ కిస్క గొ** గాళ్ల ట్రోల్స్ గురించి క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ సూచనలు.. ఆ పని చేయాలంటూ!

సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకోవద్దని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ క్రికెటర్లకు సూచించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ 2022 సూపర్ 4మ్యాచ్ చివరి దశలో ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసిఫ్ అలీ చివర్లో కీలక పాత్ర పోషించాడు. అతను భువీ వేసిన 19వ ఓవర్లో 19పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ అతన్ని అవుట్ చేసినప్పటికీ.. పాకిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

వీకిపిడియాలో ‘ఖలిస్తానీ’గా ఎడిట్
ఈ మ్యాచ్ తర్వాత.. 23 ఏళ్ల అర్ష్‌దీప్‌పై జాత్యాహంకార దూషణలతో ట్విట్టర్లో నెటిజన్లు పోస్టులు పెట్టారు. అతని వికీపీడియా పేజీని 'ఖలిస్తానీ'గా మార్చేంత వరకు పరిస్థితి దిగజారింది. అర్ష్‌దీప్ పట్ల ఇలాంటి దూషణలను ఖండించిన గవాస్కర్ క్రికెటర్లు అస్సలు సోషల్ మీడియా ట్రోల్స్‌ను పట్టించుకోవద్దంటూ కోరాడు. 'క్రికెటర్లుగా మీరు పబ్లిక్ మీడియాలో ఉంటున్నట్టయితే నేను చెప్పేది గుర్తుంచుకోండి. నేను అసలు సోషల్ మీడియా అనే పిలవను. ఎందుకంటే అందులో సామాజిక కోణం అంటూ ఏమీ లేదు. మీరు సోషల్ మీడియా (పబ్లిక్ మీడియా)లో కొన్నిసార్లు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. పబ్లిక్ మీడియాలో ఉండకపోవడమే ఉత్తమం. ఉన్నా అస్సలు ట్రోల్స్, కామెంట్లను బుర్రకెక్కనివ్వొద్దు' అని గవాస్కర్ ఓ ప్రముఖ వెబ్ సైట్‌తో అన్నారు.

ఇంతకీ ఎవరు వాళ్లు..?
ఇకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని కొన్ కిస్క గొ** గాళ్ల కామెంట్లకు ఎందుకు రియాక్ట్ కావాలంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. 'పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవారిని ఎందుకు అంత తీవ్రంగా తీసుకుంటారో నాకు అర్థం కాదు. ఇంతకీ ఎవరు వాళ్ళు? మాజీ ఆటగాడా లేదా తోటి ఆటగాడా లేదా ఓ ప్రముఖ వ్యక్తా.? ఎవడో ఏదో కూశాడని మనసు కల్లోలం చేసుకోవద్దని చెబుతున్నా. ఒకవేళ క్రికెట్ ఏళ్లుగా ఆడిన వ్యక్తిగానీ, క్రికెట్లో కాస్త పేరున్న వ్యక్తి గానీ ఏదైనా అంటేనే దానికి రెస్పాండ్ కావాలి గానీ కారు కూతలు కూసేవాళ్లను కూసింత కూడా పట్టించుకోవద్దు' అని గవాస్కర్ తెలిపాడు.

ఈ ఆన్ లైన్ వెబ్ సైట్లు ఉన్నాయే..!
ఈ ఆన్‌లైన్ వెబ్ సైట్లు సైతం ఎందుకు ఈ పిచ్చికూతలను అంతా సీరియస్‌గా తీసుకుంటాయో నాకు తెలుసు. వాళ్లకు వ్యూయర్ షిప్ కావాలంటే.. కనుబొమ్మలు ఎగురవేసే హెడ్ లైన్స్ కోసం ఈ వెబ్ సైట్లు చూస్తుంటాయి. సో స్లామ్స్, సో అండ్ సో గ్రిల్స్ లాంటి హెడ్ లైన్స్ వాళ్లకు ఇంపార్టెంట్. నేను ఇలాంటి పబ్లిక్ మీడియాకు దూరంగా ఉంటాను. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కొంత వరకు మాత్రమే పరిమితంగా ఉంటాను. సోషల్ మీడియాలో కామెంట్లు చేసేవారికి సరిగ్గా బ్యాట్ కూడా పట్టుకోని రాకపోవచ్చు.. అలాంటివారి అభిప్రాయాలను, ఉద్దేశాలను జీరో పర్సెంట్ కూడా పట్టించుకోకండి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications