కుంటి బాతులా ఉంది: ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై సన్నీ

హైదరాబాద్: టీమిండియా సెలక్షన్ కమిటీపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నాడు. తాజాగా మిడ్ డేకి రాసిన కాలమ్‌లో గవాస్కర్ సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
"ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారు. ఆ తర్వాత విండీస్ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్ అంటూ ప్రకటించారు. సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా? లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా?" అంటూ ప్రశ్నించాడు.
"ఈ తరహా సెలక్షన్ విధానం సరైనది కాదు. మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కోహ్లీ కెప్టెన్సీ అనేది వరల్డ్‌కప్ వరకే. ఆ తర్వాత కెప్టెన్‌ను ఎంపిక చేసే అధికారం సెలక్టర్లకు ఉంది. అయితే, కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా నియమించేందుకు సెలక్టర్లు ఐదు నిమిషాలైన తీసుకున్నారో లేదో" అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
"కెప్టెన్‌గా కోహ్లీనే తిరిగి కొనసాగిస్తూ ఆగమేఘాలపై ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కోహ్లీని కెప్టెన్‌గా తిరిగి ఎంపిక చేయాలనుకుంటే దానికో సాదారణ సమావేశం నిర్వహించి అప్పుడు ప్రకటించాల్సింది" అని గవాస్కర్ ధ్వజమెత్తాడు. ఇక, ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్లను ఏ రకంగా తప్పించారని గావస్కర్ సెలక్టర్లను నిలదీశాడు.
ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేదనుకుంటే, టీమిండియాను ఫైనల్ చేర్చలేకపోయినా... కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారి తీయదా? అని సెలక్టర్లను గవాస్కర్ ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే, కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది.
వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే టీ20తో ఈ సిరిస్ ఆరంభమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications