Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవల్ పిచ్‌పై లిటిల్ మాస్టర్ ఫైర్!

IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరిన తరుణంలో క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ సంప్రదాయ గ్రీన్-టాప్ పిచ్‌ను చూసే అవకాశం లభించింది. టెస్ట్ సిరీస్‌లోని మొదటి 4 టెస్టులు బ్యాటర్లకు స్వర్గధామంలా మారిన ఫ్లాట్ వికెట్లపై జరిగాయి. అక్కడ బౌలర్లకు పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో పరుగులు భారీగా వచ్చాయి. అయితే ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో పచ్చికతో నిండిన పిచ్ కనిపించింది. ఈ పిచ్‌ను చూసిన భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ జట్టు వద్ద సరైన బౌలర్లు లేకపోవడం వల్లే వారు ఇలాంటి పిచ్‌ను తయారు చేశారని సునీల్ గవాస్కర్ ఘాటుగా విమర్శించారు.

గవాస్కర్ కామెంట్స్ వెనుక ఉన్న కారణాలు
ఐదో టెస్టులో ఇంగ్లండ్ జట్టు కీలకమైన 4 మార్పులతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా ఈ కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలాగే గత మ్యాచ్‌లలో కీలక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా చివరి మ్యాచ్‌లో స్థానం దక్కించుకోలేదు. ఈ ముగ్గురూ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగానికి ప్రధాన బలాలు. ఈ కీలక ఆటగాళ్లు లేకపోవడంతో ఇంగ్లండ్ తమ అనుభవం లేని బౌలర్లకు సహాయపడేలా గ్రీన్ పిచ్‌ను సిద్ధం చేసిందని గవాస్కర్ పరోక్షంగా సూచించారు. సోనీ స్పోర్ట్స్‌లో గవాస్కర్‌ను ఈ పిచ్ పై ఇంగ్లండ్ తమ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ఎంత మిస్ అవుతుందని ప్రశ్నించగా.. లిటిల్ మాస్టర్ తనదైన శైలిలో బదులిచ్చారు.

Sunil Gavaskar Slams Green Oval Pitch England Made It Due to Lack of Bowlers

అసలు వాళ్ల దగ్గర బౌలింగ్ లేదని.. అందుకే వాళ్లు ఇలాంటి పిచ్ తయారు చేశారని గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మీరు చూడండి, స్టోక్స్ వికెట్లు తీశాడు, ఆర్చర్ వికెట్లు తీశాడు, కార్స్ వికెట్లు తీశాడు... వాళ్లు ఇంగ్లండ్ జట్టులో లేకపోతే ఇంకెవరు వికెట్లు తీస్తారు? దీనివల్లే వాళ్లు టంగ్ (జోష్ టంగ్) వంటి బౌలర్లకు, ఇతర బౌలర్లకు సహాయం లభించేలా అలాంటి పిచ్‌ను తయారు చేశారు" అని గవాస్కర్ వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇంగ్లాండ్ పిచ్ తయారీ వ్యూహంపై గవాస్కర్‌కు ఉన్న సందేహాలను స్పష్టం చేశాయి.

తొలి రోజు ఆట తీరు ఇలా..
టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు ఒక గ్రీన్ పిచ్‌పై చాలా తక్కువగా పరిగణించబడుతుంది, ఇది ఇంగ్లాండ్ వ్యూహానికి బలం చేకూర్చినట్లు స్పష్టమైంది. భారత్ తరఫున కరుణ్ నాయర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి 52 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ఆయన కాకుండా మరే బ్యాటర్ కూడా ఎక్కువ సమయం క్రీజులో నిలబడలేకపోయారు. ఇది ఇంగ్లాండ్ బౌలర్ల ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం కరుణ్ నాయర్‌కు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తోడుగా ఉన్నారు. రెండో రోజు వీరిద్దరి భాగస్వామ్యంపైనే భారత జట్టు భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Friday, August 1, 2025, 12:37 [IST]
Other articles published on Aug 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+