విరాట్, రోహిత్ వివాదంపై గవాస్కర్ భిన్నమైన కామెంట్స్.. అసలు ఏమన్నాడంటే?..

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొన్నాయని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యత అప్పగించినప్పటి నుంచే ఈ పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలపై అభిమానులతోపాటు పలువురు మాజీలు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీంతో తాజాగా ఈ వార్తలపై టీమిండియా మాజీ, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.

కోహ్లీ, రోహిత్ వివాదంపై గవాస్కర్ భిన్నమైన కామెంట్స్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నెలకొన్న వివాదంపై సునీల్ గవాస్కర్ కాస్త భిన్నంగా స్పందించాడు. ఈ వ్యవహారంపై విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ స్వయంగా మాట్లాడేంత వరకు ఇతరులు ఎవరూ మాట్లాడకపోవడం బెటర్ అని ఆయన సూచించాడు. రోహిత్, కోహ్లీ బహిరంగంగా వారి అభిప్రాయాలను చెప్పే వరకు తాను ఎటువంటి కామెంట్స్ చేయదలచుకోలేదని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సరైన సమాచారం లేకుండా వారిని వేలెత్తి చూపడం మంచిది కాదని సూచించాడు.

కోహ్లీ, రోహిత్‌పై ప్రశంసలు
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలందించారని కొనియాడాడు. అలాంటి వ్యక్తులపై సరైన సమాచారం లేకుండా నిందలు వేయడం తాను న్యాయమని అనుకోవడం లేదని ఆయన అన్నాడు.

అజారుద్దీన్ వ్యాఖ్యలపై గవాస్కర్ కామెంట్స్
కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయనే విధంగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత క్రికెట్ పెద్దన్న గవాస్కర్.. అజారుద్దీన్ వద్ద కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయనేందుకు కచ్చితమైన సమాచారం ఉంటే అది క్రికెట్ ప్రపంచానికి చెప్పాలని కోరాడు.

అజారుద్దీన్ ఏమన్నాడంటే..
టీమిండియా సీనియర్ ఆటగాళ్లైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విబేధాలు నెలకొన్నాయని వస్తున్న వార్తలపై మంగళవారం దిగ్గజ కెప్టెన్ అజారుద్దీన్ స్పిందించాడు. రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌లో ఆడడం లేదని, విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడడం లేదని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. దీని బట్టి వారి ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నట్టున్నాయని అభిప్రాయపడ్డాడు. విరామాలు తీసుకోవడంలో తప్పులేదని, కానీ దానికి సరైన సమయం ఉండాలని, లేకపోతే ఇలాంటి టెన్షన్ వాతావరణమే నెలకొంటుందని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications