రోహిత్ చెప్పినట్లు ఆ తెలుగు కుర్రాడు భారత జట్టుకు ఆడటం ఖాయం: సునీల్ గవాస్కర్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను టీమిండియా ఆల్‌ఫార్మాట్ ప్లేయర్ అవుతాడన్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అభిప్రాయంతో ఏకభవించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ (32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మ్యాచ్ అనంతరం తిలక్ వర్మను మెచ్చుకున్న రోహిత్.. అతి త్వరలోనే అతను టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదుగుతాడని కితాబిచ్చాడు.

తిలక్ వర్మ సూపరో సూపర్..

తిలక్ వర్మ సూపరో సూపర్..

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులు చేసిన తిలక్ వర్మ గురించి స్టార్ స్పోర్ట్స్‌ చానెల్‌లో మాట్లాడిన గవాస్కర్.. రెండు విషయాల్లో మెరుగైతే తెలుగు కుర్రాడికి తిరుగుండదని చెప్పాడు. 'తిలక్ వర్మ టెంపర్‌మెంట్ అద్భుతం. చెన్నై సూపర్ కింగ్స్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. తీవ్ర ఒత్తిడిలో అతను ఆడిన తీరు అమోఘం. పరిస్థితులకు తగ్గట్లు సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించడం ఆకట్టుకుంది. వైడ్ రేంజ్ షాట్స్‌తో స్ట్రైక్ రోటేడ్ చేస్తున్నాడు. అతని ఆటతీరు చూస్తుంటే గొప్ప క్రికెటర్ అవుతాడనిపిస్తోంది.

ఆ రెండు విషయాల్లో..

ఆ రెండు విషయాల్లో..

మంచి క్రికెట్ ఆడే లక్షణం ఉంటే పరిస్థితులు అనుకూలంగా లేకున్నా రాణించవచ్చు. వ్యక్తిగత ప్రదర్శనను ఎప్పటికప్పుడూ విశ్లేషించుకొని పరుగులు చేయవచ్చు. రోహిత్ శర్మ చెప్పినట్లు తిలక్ వర్మ భారత్ తరఫున ఆల్‌ఫార్మాట్‌లో ఆడగలడు. అయితే దానికోసం అతను కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరింత ఫిట్‌గా తయారవ్వడంతో పాటు.. టెక్నిక్‌ను మరింత దృఢంగా మార్చుకోవాలి. అలా చేస్తే ఈ హైదరాబాద్ కుర్రాడు రోహిత్ చెప్పినట్లు టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడగలడు'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

అతి త్వరలోనే...

అతి త్వరలోనే...

తిలక్ వర్మలో టెక్నిక్, టెంపర్.. అన్నీ కలిసి ఉన్నాయని, అతను టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. 'ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలో తిలక్ వర్మ సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాడు.అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతాడు. వన్డే, టెస్టులు, టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా తరఫున ఆడటాన్ని మనం త్వరలోనే చూస్తాం. పలువురు యంగ్ క్రికెటర్లకు ఐపీఎల్ ఉజ్వల భవిష్యత్తును ఇచ్చింది. ఆ జాబితాలో తిలక్ వర్మ చేరనున్నాడు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 17, 2022, 19:13 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X