Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఐపీఎల్‌లో రోహిత్ రెచ్చిపోతాడు.. జోస్యం చెప్పిన మాజీ లెజెండ్!

 Sunil Gavaskar says Rohit will do great in IPL 2023

ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023)లో రెచ్చిపోతాడట. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ ఈసారి ఐపీఎల్‌లో చెలరేగుతాడని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో రోహిత్ అంత గొప్పగా రాణించలేదు. అతను విఫలం అవడంతో ఆ జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే.

గత సీజన్‌లో ఫెయిల్..

గత సీజన్‌లో ఫెయిల్..

గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన రోహిత్.. కొన్నిరోజుల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో వన్డే సిరీసులో మళ్లీ బరిలో దిగినప్పటి నుంచి రోహిత్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. తనదైన స్టైల్‌లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ చెలరేగుతున్నాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు శతకం కూడా సాధించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కూడా రోహిత్ చెలరేగుతాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

రోహిత్ ఏదో చేస్తాడు..

రోహిత్ ఏదో చేస్తాడు..

వచ్చే ఐపీఎల్‌లో రోహిత్ కచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాడని గవాస్కర్ గట్టిగా చెప్పాడు. అలాగే ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఇషాన్ కిషన్ కూడా ఆ జట్టుకు చాలా కీలకంగా మారతారని సన్నీ చెప్పాడు. 'ముంబై దగ్గర ఉన్న ట్రంప్ కార్డుల్లో జోఫ్రా ఆర్చర్ ఒకడు. దీన్ని కాదనలేం. అదే సమయంలో ఇషాన్ కిషన్‌ను కూడా మర్చిపోకూడదు. అతను వన్డే డబుల్ సెంచరీ సాధించాడు కూడా. అతన్ని కూడా కచ్చితంగా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక రోహిత్ అయితే ఈ సీజన్‌లో ఏదో స్పెషల్ చేస్తాడని నాకు గట్టిగా అనిపిస్తోంది' అని గవాస్కర్ తన మనసులో మాట బయటపెట్టాడు.

ముంబై బలహీనత అదే..

ముంబై బలహీనత అదే..

జోఫ్రా ఆర్చర్ చేరికతో ముంబై జట్టు మరింత బలంగా కనిపిస్తోందని, ఇన్నింగ్స్ ఆరంభంలో అయినా లేదంటే డెత్ ఓవర్లలో అయినా రాణించి వికెట్లు తీయగలిగే సత్తా ఆర్చర్ వద్ద ఉందని సన్నీ కొనియాడాడు. పరుగులు కట్టడి చేయడంతోపాటు వికెట్లు తీయగలిగే అతను ముంబైకు కీలకమని అభిప్రాయపడ్డాడు.

ముంబైకు ఉన్న ప్రధాన సమస్య ఆ జట్టులోని స్పిన్ బౌలింగ్ విభాగమని, ఈ డిపార్ట్‌మెంట్‌లో అనుభవం లేకపోవడం కొంత సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాడీ మాజీ లెజెండ్. ముంబై స్పిన్ బౌలింగ్ యూనిట్ బలహీనంగా కనిపిస్తోందని చెప్పాడు. మరి ఈ ఏడాది ముంబై ఆటతీరు మారుతుందేమో చూడాలి.

Story first published: Wednesday, March 15, 2023, 17:53 [IST]
Other articles published on Mar 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+