అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్

Ind vs Eng 2021 : Sunil Gavaskar Slams England’s Rotation Policy || Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశం తరఫున బరిలో దిగేటప్పుడు అన్నిటికి సిద్ధపడాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. ఆటగాళ్ల రొటేషన్ కారణంగానే భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతను.. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతిపై స్పందించాడు. అసలు ఈ పద్దతిని అర్థం చేసుకోవడమే చాలా కష్టమని తెలిపాడు.

దేనికైనా సిద్దపడాలి..

దేనికైనా సిద్దపడాలి..

‘ఆటగాళ్లకు వర్క్‌లోడ్ తగ్గించడం లేదా రొటేషన్‌ పద్ధతి అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కరోనా కారణంగా బయోబుడగలో నెలల తరబడి ఉండటమనేది కూడా కష్టమని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సెప్టెంబర్‌ నుంచీ నేను అందులో ఒకడిగా ఉన్నాను. కానీ, దేశం తరఫున ఆడేటప్పుడు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే నీ జట్టు తరఫున ఎలా బాగా ఆడగలవు?' అని గవాస్కర్‌ ప్రశ్నించాడు.

రొటేషన్ ముంచింది..

రొటేషన్ ముంచింది..

ఇక, ఇంగ్లండ్ ఓటమికి ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతి కూడా కారణమని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. 'టీమిండియా సైతం చాలా కాలంగా బయోబుడగలోనే ఉంది, అయినా.. ఆస్ట్రేలియాలో భారత్‌లో ఎలా ఆడిందో మనం చూశాం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లోనూ యువ ఆటగాళ్లు చక్కగా ఆడారు. రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌పటేల్‌ అద్భుత భాగస్వామ్యాలు జోడించారు, అవసరమైన వేళ జట్టు కోసం రాణించడం గొప్ప విశేషం. అలాంటిది జట్టుకు అవసరమైన వేళ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వర్క్‌లోడ్ పేరిట స్వదేశానికి తిరిగి వెళ్లారు. దాంతోనే ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.

సీరీస్ భారత్ కైవసం..

సీరీస్ భారత్ కైవసం..

చెన్నైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్‌ తర్వాత మూడు టెస్టుల్లోనూ ఘోర పరాభవాలు చవిచూసింది. జోస్‌బట్లర్‌, మొయిన్‌ అలీ లాంటి కీలక ఆటగాళ్లు సిరీస్‌ మధ్యలో స్వదేశం వెళ్లిపోగా, బెయిర్‌స్టో చివరి రెండు టెస్టుల్లో ఆడాడు. ఇలా కీలక ఆటగాళ్లను మార్చడం కూడా ఇంగ్లండ్‌ ఓటమికి ఓ కారణమని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీ సేన 3-1తో సిరీస్ కైవసం చేసుకొని వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

బీసీసీఐ సత్కారం..

బీసీసీఐ సత్కారం..

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సునీల్ గవాస్కర్‌ను బీసీసీఐ ‌ ఘనంగా స‌త్క‌రించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం కామెంటేట‌ర్‌గా సేవలందిస్తున్న్ గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ ప్ర‌త్యేక జ్ఞాపిక‌ను అంద‌జేసింది. భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం ముగిసిన నాలుగో టెస్టు మూడో రోజు ఆట లంచ్ బ్రేక్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షా గ‌వాస్కర్‌కు జ్ఞాపికను అందజేశారు. అలాగే ప్ర‌త్యేక బ్లూ క‌ల‌ర్ క్యాప్‌ను కూడా జై షా అంద‌జేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, March 7, 2021, 16:12 [IST]
Other articles published on Mar 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X