For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా చాలా ముందుకు వెళ్లిపోయింది.. టీ20 ప్రపంచకప్‌‌లో ధోనీ ఆడటం అసాధ్యం: గవాస్కర్

Sunil Gavaskar says Dont think MS Dhoni would be part of Indian squad for T20 World Cup
T20 World Cup : Sunil Gavaskar Makes Massive Statement On MS Dhoni's Career

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌లో ధోనీ ఆడటం సందేహమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. వ్యక్తిగతంగా టీ20 ప్రపంచకప్‌‌ జట్టులో ధోనీ ఉండాలని కోరుకుంటున్నాఅని అంటున్నారు. ఐపీఎల్ 2020లో రాణించి భారత జట్టులోకి పునరాగమనం చేయాలని మహీ భావించారు. కానీ.. కరోనా వైరస్ ధోనీ ఆశలకు గండి కొట్టేలా ఉంది. ఏప్రిల్ 15కి వాయిదా పడిన ఐపీఎల్.. ఇప్పుడు టోర్నీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడు చాలా కష్టం:

ఇప్పుడు చాలా కష్టం:

సునీల్‌ గవాస్కర్‌ తాజాగా వార్తా దినపత్రిక డైనిక్ జాగ్రాన్‌తో మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా టీ20 ప్రపంచకప్‌‌ జట్టులో ధోనీ ఉండాలని కోరుకుంటున్నా. కానీ అదే జరిగే అవకాశం లేదు. జట్టులోకి ధోనీ ఎంపిక ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఇప్పటికే ధోనీని పక్కనపెట్టి టీమిండియా చాలా ముందుకు వెళ్లిపోయింది. ఇక ధోనీ తన వీడ్కోలుని ఘనంగా ఆశించకపోవచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా క్రికెట్‌ నుంచి తప్పుకునే అవకాశం ఉంది' అని గవాస్కర్ అన్నారు.

ఎంతో విలువైన ఆటగాడు:

ఎంతో విలువైన ఆటగాడు:

తాజాగా వసీం జాఫర్‌ కూడా ట్విటర్‌లో ధోనీపై స్పందించారు. 'వికెట్ల వెనుక, లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ ఎంతో విలువైన ఆటగాడు. అతడు టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి. ఇప్పటికే జట్టుకు ఎంతో చేసాడు. ధోనీ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే మనం అతడిని మించి చూడాల్సిన పనిలేదు. ధోనీని ఆడిస్తే.. కేఎల్‌ రాహుల్‌పై భారం తగ్గుతుంది. మరోవైపు రిషభ్‌ పంత్‌ను లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా ఉపయోగించుకోవచ్చు' అని మాజీ ఓపెనర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

8 నెలల పాటు బ్యాట్‌ పట్టని మహీ:

8 నెలల పాటు బ్యాట్‌ పట్టని మహీ:

2019 వన్డే ప్రపంచకప్‌‌ ఓటమి అనంతరం ధోనీ మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. సుమారు 8 నెలల పాటు బ్యాట్‌ పట్టని మహీ.. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రం పాల్గొన్నాడు. ప్రాణాంతక వైరస్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుందో లేదోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ధోనీ భవితవ్యంపై మరోసారి గందరగోళం నెలకొంది. ధోనీ రీ ఎంట్రీ కష్టమేనని వీరేందర్ సెహ్వాగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కామెంట్ చేయడం మహీ ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు.

చోటు ఎక్కడుంది?:

చోటు ఎక్కడుంది?:

తాజాగా సెహ్వాగ్‌ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'జట్టులో ధోనీకి చోటు ఎక్కడుంది?. అతడు ఎక్కడ సరిపోతాడు. రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్‌. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో రాహుల్‌ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంది' అని అన్నారు. మహీపై ఎవరి అభిప్రాయాలను వారు చెపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

Story first published: Friday, March 20, 2020, 14:12 [IST]
Other articles published on Mar 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+