Sunil Gavaskar: టీమిండియాలో ఎవరి స్థానం పదిలం కాదు.. వారి నుంచి తీవ్ర పోటీ

ప్రస్తుతం ఉన్న టీమిండియాలో ఎవరి స్థానం పదిలం కాదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి తమ స్థానం పదిలం అనే నిశ్చింత లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీమిండియాకు ఉత్తేజకరమైన క్షణాలు ఉన్నాయని తెలిపారు. ఆటగాళ్లు తమ టాలెంట్‌ను చూపించి మరి తమను సెలెక్టు చేసేలా చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఈ పోటీ చూస్తుంటే తనకు ఆనందంగా ఉందని సునీల్ గవాస్కర్ తెలిపారు. దీంతో తమ వెనుక ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా తుది జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తర్వాతి మ్యాచ్‌కు కూడా తాము జట్టులో ఉంటామని కచ్చితంగా చెప్పుకోలేరని సునీల్ గవాస్కర్ చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సునీల్ గవాస్కర్ 1971 నుంచి 1987 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 125 టెస్టు మ్యాచ్‌లు ఆడి 51 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 4 సార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకోగా అత్యధిక స్కోర్ 236 పరుగులుగా ఉంది. ఇక 108 వన్డే మ్యాచ్‌ల్లో 35 సగటుతో 3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 103 పరుగులుగా ఉంది.
మరోవైపు నేడు భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో అధిక్యంలో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే నేటి మ్యాచ్‌కు వరుణుడి ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం ధర్శాశాలలో ఉన్న వాతావరణం దృష్యా వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆదివారం జరగునున్న మూడో టీ20 మ్యాచ్ కూడా ధర్మశాలలోనే జరగనుండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications