For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'షమీ ఆకలితో ఉన్న చిరుతలా కనిపిస్తున్నాడు'

Sunil Gavaskar said Mohammed Shami reminds me of Malcolm Marshall

కటక్: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. షమీని చూస్తుంటే విండీస్ గ్రేట్ పేసర్ మాల్కమ్ మార్షల్ గుర్చుకొస్తున్నారు. షమీ రనప్ మొదలు పెడితే ఆకలితో ఉన్న చిరుతను తలపిస్తున్నాడని గవాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీ

 చిరుతలా కనిపిస్తున్నాడు:

చిరుతలా కనిపిస్తున్నాడు:

తాజాగా సునీల్ గవాస్కర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'నన్ను గాఢ నిద్రలో కూడా ఉలిక్కి పడి లేచేలా చేసిన వెస్టిండీస్ దిగ్గజ బౌలర్‌ మాల్కమ్‌ మార్షల్‌ను షమీ గుర్తుకు తెస్తున్నాడు. అతడే నా ఫేవరెట్. షమీ బంతి వేసేందుకు పరిగెడుతుంటే ఆకలితో ఉన్న చిరుత వేటకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది' అని అన్నారు. షమీ మూడో వన్డేలో తన కోటా 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఈ ఏడాది టాప్‌:

ఈ ఏడాది టాప్‌:

మహమ్మద్ షమీ ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో 42 వికెట్లు తీసి టాపర్‌గా నిలిచాడు. 2014లోనూ 38 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది షమీ ఐదు వికెట్లను ఒకసారి సాధించగా.. ఒక హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేశాడు.

38 వికెట్లతో బౌల్ట్‌:

38 వికెట్లతో బౌల్ట్‌:

షమీ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్య్గుసన్‌లు ఉన్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ 38 వికెట్లు తీయగా.. ఫెర్గ్యుసన్‌ 35 వికెట్లను తీసాడు. ఈ ఏడాది భారత్‌కు విండీస్‌ మ్యాచే చివరిది కాగా.. కివీస్‌కు సైతం వన్డే మ్యాచ్‌లు లేవు. దాంతో షమీనే టాపర్‌గా ఉండనున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో షమీ అత్యధిక వన్డే వికెట్లు సాధించడం ఇది రెండోసారి.

వేగంగా 100 వికెట్లు:

వేగంగా 100 వికెట్లు:

వన్డేల్లో భారత్‌ తరఫున వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా షమీనే. 56 వన్డేల్లో ఈ ఘనతను అందుకున్నాడు. భారత్‌ తరఫున షమీ ఇప్పటివరకు 47 టెస్టులు, 73 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 175 వికెట్లు, వన్డేల్లో 136 వికెట్లు, టీ 20 ఫార్మాట్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, December 23, 2019, 16:10 [IST]
Other articles published on Dec 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+