For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: ఆ ఒక్క బలహీనత కారణంగా.. టీమిండియా కోచ్ పదవికి దూరంగా ఉన్నా: సన్నీ

Sunil Gavaskar reveals why he never coached Team India, Here is a reason

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇప్పటి వరకూ టీమిండియా కోచ్ పదవికి కనీసం ఒక్కసారి కూడా దరఖాస్తు చేయలేదు. ఇక భవిష్యత్‌లో కూడా చేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా చెప్పారు. గవాస్కర్ సహచరులు అయిన కపిల్‌ దేవ్, అజిత్ వాడేకర్, బిషన్‌సింగ్ బేడి‌లు ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీమిండియా కోచ్‌లుగా పనిచేసిన విషయం తెలిసిందే. కానీ అపార క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న గవాస్కర్ మాత్రం ఆ కోచ్ బాధ్యతకి దూరంగా ఉండిపోయారు. కోచ్ పదవికి దూరంగా ఉండటానికి గల అసలు కారణాన్ని తాజాగా గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 ఆటను ఎక్కువసేపు చూడలేను:

ఆటను ఎక్కువసేపు చూడలేను:

తాను కోచ్‌గా సరిపోనని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. 'నేను ఆటను ఎక్కువసేపు చూడలేను. నేను ఆడే రోజుల్లోనూ అంతే. మ్యాచులో నేను ఔటైతే.. మ్యాచ్‌ను విరామాలతో మాత్రమే చూసేవాణ్ని. నాకు చదవడం అంటే చాలా ఇష్టం. కాసేపు మ్యాచ్ చూసి డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లి.. ఏదైనా చదువుకునేవాణ్ని లేదా లేఖలకు సమాధానాలు ఇవ్వడం లాంటివి చేసేవాణ్ని. ఆ తర్వాత మళ్లీ వచ్చి మ్యాచ్‌ చూసేవాణ్ని. గుండప్ప విశ్వనాథ్‌, మా అంకుల్‌ మాధవ్‌ మంత్రిలా నేను ప్రతి బంతినీ చూసే రకం కాదు. అది నా వల్ల అసలు సాధ్యం కాదు' అని గవాస్కర్ తెలిపారు.

కోచ్‌ మాత్రం పనిచేయలేను:

కోచ్‌ మాత్రం పనిచేయలేను:

'ఓ జట్టుకు కోచ్‌ లేదా సెలక్టర్‌ కావాలనుకుంటే.. ప్రతి బంతినీ చూడాలి. ప్రతి ప్లేయర్ ఆటను గమనించాలి. అంతేకాదు ప్రత్యర్థి ఆటగాళ్లపై కూడా ఓ కన్నేయాలి. అది నా వల్ల కాదు. కాబట్టి నేనెప్పుడూ కోచ్‌ అవ్వడం గురించి ఆలోచించలేదు. అ యితే సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌, వీరేందర్ సెహ్వాగ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌ లాంటి క్రికెటర్లు నా దగ్గరికి వచ్చేవాళ్లు. నా ఆలోచనలను పంచుకునేవాణ్ని. సలహాలు తీసుకునేవారు. అలా వాళ్లకు సహాయం చేయగలిగా. కానీ పూర్తి స్థాయి కోచ్‌ మాత్రం నేను పనిచేయలేను' అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

తర్వాత ద్రవిడ్:

తర్వాత ద్రవిడ్:

టీమిండియా చీఫ్ కోచ్‌గా ప్రస్తుతం రవిశాస్త్రి ఉన్న విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన మొదటిసారి జట్టుకు అద్భుత విజయాలు అందించడంతో.. రెండోసారి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. ఇప్పుడు కూడా భారత్ అన్ని ఫార్మాట్లలలో దూసుకుపోతోంది. ఇక రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అండర్-19, భారత్-ఎ జట్టు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. ఎంతో మంది యువ క్రికెటర్లని టీమిండియాకి అందించిన విషయం తెలిసిందే. మరి చీఫ్ కోచ్‌ పదవిపై ద్రవిడ్ ఆసక్తిగా ఉన్నాడో లేదో చూడాలి.

సన్నీ అరుదైన ఘనత:

సన్నీ అరుదైన ఘనత:

భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. 236 నాటౌట్ అత్య‌ధిక స్కోర్‌. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. గ‌వాస్క‌ర్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఇటీవల 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆయనను‌ ఘనంగా స‌త్క‌రించింది.



Story first published: Monday, June 7, 2021, 9:56 [IST]
Other articles published on Jun 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+