INDvsAUS : సూర్య బ్యాటింగ్‌లో లోపం అదే.. బయట పెట్టిన మాజీ లెజెండ్!

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా వన్డేల్లో విఫలం అవుతున్నాడు. వెన్నునొప్పితో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరం అవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సూర్యకుమార్ సరిగా ఉపయోగించుకోలేదు. తొలి రెండు మ్యాచుల్లో తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇది చూసిన చాలా మంది సూర్య తనకు వచ్చిన అవకాశాలను వేస్ట్ చేసుకుంటున్నాడని విమర్శించారు.

సూర్య సమస్య ఏంటంటే..?
ఈ క్రమంలోనే మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. సూర్య బ్యాటింగ్‌లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని గవాస్కర్ చెప్పాడు. అతను క్రీజులో నిలబడే విధానం కూడా ఓపెన్ స్టాన్స్ అని, అది టీ20 ఫార్మాట్‌కు బాగుంటుంది కానీ మిగతా ఫార్మాట్లలో అంతగా ఉపయోగపడదని అభిప్రాయపడ్డాడు. 'సూర్యది టెక్నికల్ సమస్య. అతని స్టాన్స్ కూడా టీ20 క్రికెట్‌లో యూజ్ అవుతుంది. ఎందుకంటే.. ఆ ఫార్మాట్‌లో ఓవర్ పిచ్ అయిన ఏ డెలివరీని అయినా ఫ్లిక్ చేసి సిక్సర్ కొట్టొచ్చు. కానీ ఇక్కడ బంతి అతని కాలుకు దగ్గరలో పడితే.. ఈ స్టాన్స్ వల్ల బ్యాట్ కచ్చితంగా క్రాస్‌గా కిందకు దిగాల్సి ఉంటుంది. అప్పుడు కనుక బంతి స్వింగ్ అయితే దాన్ని ఎదుర్కోవడం సూర్యకు కష్టంగా మారుతుంది' అని సన్నీ విశ్లేషించాడు.

చేయాల్సిన పని అదే..
సూర్య వన్డే గణాంకాలు కూడా అతని టీ20 లెక్కలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 22 వన్డేలు ఆడిన అతను కేవలం 25.47 సగటు, 102.36 స్ట్రైక్ రేటుతో కేవలం 433 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచుల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. అదే టీ20ల్లో అయితే సూర్య ఆటతీరు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 48 టీ20 మ్యాచులు ఆడిన అతను 46.52 సగటు, 175.76 స్ట్రైక్ రేటుతో 1675 పరుగులు చేశాడు. దీనిలో మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో అతని టెక్నికల్ సమస్యలను ఎత్తి చూపిన సునీల్ గవాస్కర్.. 'ఈ సమస్యలను అధిగమించాలంటే.. ముందు సూర్య వెళ్లి బ్యాటింగ్ కోచ్‌తో మాట్లాడాలి. అప్పుడే ఇది మారుతుంది' అని చెప్పుకొచ్చాడు.

మూడో వన్డేలో ఛాన్స్..
అయితే అతను ఇలా వరుసగా విఫలమైనా కూడా అతనికే మూడో వన్డేలో అవకాశం ఇస్తారని మరో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. ఈ వైఫల్యాలను భారత జట్టు మేనేజ్‌మెంట్ పట్టించుకోదని, అతనిపై నమ్మకం ఉంచుతుందని పేర్కొన్నాడు. 'జట్టులో ఈ స్థానం కోసం ఇంకెవరైనా గట్టిగా పోటీ పడుతుంటే విషయం వేరేగా ఉంటుంది. కానీ సూర్య ఒక్కడే ఈ స్థానం కోసం పోటీ పడ్డాడు. మిగతా వారంతా ఆ తలుపుల దగ్గరే వెయిట్ చేస్తున్నారు. సూర్య మాత్రం తలుపులు బద్దలు కొట్టి వచ్చాడు. కాబట్టి టీం మేనేజ్‌మెంట్ అతన్ని రిప్లేస్ చేస్తుందని నాకు అనిపించడం లేదు' అని జడేజా తేల్చిచెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications