విరాట్‌ను విమర్శించలేదు.. అనుష్క శర్మపై అసహ్యకర వ్యాఖ్యలు చేయలేదు: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను విమర్శించలేదని, అతని సతీమణి అనుష్క శర్మ పట్ల అసహ్యకర వ్యాఖ్యలు చేయలేదని దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌కు హిందీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. కోహ్లీ బ్యాటింగ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుష్కశర్మ కూడా సునీల్ గవాస్కర్‌ను తప్పుబట్టడం ఈ వివాదానికి మరింత అగ్గిని రాజేసింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నాడు. విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో అతను, అనుష్క శర్మలు కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోను గురించి మాత్రమే ప్రస్తావించానన్నాడు.

ఎక్కడ ఆమెపై అసభ్యకర కామెంట్స్ చేశా..?

‘ఎక్కడ ఆమెను నిందించా.. ఇందులో ఎక్కడ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఉన్నాయి. కోహ్లీ పక్కింటి వారు తీసిన వీడియో గురించి మాత్రమే మాట్లాడాను. లాక్‌డౌన్‌లో విరాట్‌కు ప్రాక్టీస్ లేదు. అతని ఇంటి కంపౌండ్‌లో అనుష్కశర్మతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఆమె బౌలింగ్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఆ వీడియోలో ఉన్నది అదే. నేను దాని గురించే మాట్లాడాను.

విరాట్ వైఫల్యాలను నేను ఎక్కడా విమర్శించలేదు. ఆ వీడియోలో విరాట్‌కు అనుష్క బౌలింగ్ చేసిందని మాత్రమే చెప్పాను'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మిస్టర్ సునీల్ గవాస్కర్..

మిస్టర్ సునీల్ గవాస్కర్..

అభిమానుల అర్ధం పర్ధంలేని ట్రోలింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న అనుష్క.. గవాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను మీరు గౌరవిస్తారని తెలుసు. అలాంటి మీకు మా పట్ల గౌరవం లేదా? గత రాత్రి నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ వద్ద చాలా పదాలు, కామెంట్స్ ఉండే ఉంటాయి. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా?

2020 వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను క్రికెట్‌లోకి లాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఆగుతాయో? గౌరవనీయులైన గవాస్కర్.. ఈ జెంటిల్ మెన్ గేమ్‌లో మీరో దిగ్గజం. మీరు నా పట్ల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు ఏం అనిపించిందో అది చెప్పాలనుకున్నా'అని అనుష్క ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

అనుష్క బంతులతో..

అనుష్క బంతులతో..

అయితే గవాస్కర్ వ్యాఖ్యలను ఇక్కడ తప్పుగా అర్ధం చేసుకున్నారు. అతను తన కామెంట్రీలో లాక్‌డౌన్‌‌లో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లీ ఎదుర్కొన్నాడని చెప్పారు. కానీ కొంత మంది ఈ కామెంట్స్‌లో అనుష్క బౌలింగ్‌కు బదులు అనుష్క బంతులని రాసుకొచ్చారు. ఇవి డబుల్ మీనింగ్‌‌కు దారితీయడంతో అందరూ గవాస్కర్‌పై మండిపడ్డారు.

ఉదయం నుంచి లెంజడరీ క్రికెటర్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో గవాస్కర్ తప్పేమి లేదు. అతను వారి ప్రాక్టీస్ వీడియోను మాత్రమే ప్రస్తావించాడు.

గవాస్కర్‌పై వేటు వేయాలి....

గవాస్కర్‌పై వేటు వేయాలి....

సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్న క్రికెట్, సినీ అభిమానులు అతను కామెంటేటర్‌గా పనికిరాడని కామెంట్ చేశారు. సునీల్ గవాస్కర్ హుందాగా వ్యవహరించట్లేదని మండిపడ్డారు. ఆయనను కామెంటేటర్‌ హోదా నుంచి తొలగించాలని పట్టుబట్టారు. అలాంటి డబుల్ మీనింగ్ అర్థాలతో వ్యాఖ్యానాలు చేయడం.. పైగా ఓ పబ్లిక్ వేదిక మీద అలాంటి కామెంటరీ సరికాదంటూ హితవు పలికారు. ఈ తరహా వ్యాఖ్యలతో క్రికెటర్లను విమర్శించిన సంజయ్ మంజ్రేకర్‌ను పక్కన పెట్టినప్పుడు గవాస్కర్‌పై కూడా వేటు వేయాలని విరుష్కా ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.

సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 25, 2020, 18:13 [IST]
Other articles published on Sep 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X