ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను కొనియాడుతూ ఆ దేశ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలను భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. టెస్టు క్రికెట్‌కు ఇప్పుడు వచ్చిన దుస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఓ ఆంగ్లేయుడు సచిన్ రికార్డును అధిగమిస్తే సుదీర్ఘ ఫార్మాట్ ఎలా మెరుగవుతుందని భావిస్తున్నారని మండిపడ్డాడు.
''గత 50 ఏళ్ల అనుభవంతో నేను ఓ విషయం చెప్పగలను. తమ జట్టు రాణించప్పుడు భారత అభిమానులే కాదు, ఏ జట్టు అభిమానులు అయినా నిశ్శబ్ధంగా ఉంటారు. విదేశాల్లో భారత్ బాగా రాణిస్తున్నప్పుడు అక్కడ శబ్ధాలు వినిపిస్తుంటే, అది చాలా దూరం ప్రయాణించిన భారతీయుల మద్దతు అని అర్థం. అంతేకానీ అక్కడి స్థానికులు కాదు. దీని గురించి వ్యాఖ్యాతలు, మీడియా ఎవరైనా ఈసారి మాట్లాడితే.. తమ జట్టు మద్దతుదారులు ఎందుకు రాలేదని మనం ప్రశ్నించాలి''

''భారత్‌పై చేసే విమర్శలకు మనం దూకుడుగా సమాధానం చెప్పాలి. అలా చెబితేనే వాళ్లకు అర్థమవుతుంది. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ అధిగమిస్తే టెస్టు క్రికెట్‌కు మంచిదని ఇటీవల ఎవరో చెప్పడం నేను విన్నాను. టెండూల్కర్ రికార్డు సాధించినప్పుడు, ఇప్పుడు.. టెస్టు క్రికెట్‌లో ఏం తేడా ఉంది? ఓ ఆంగ్లేయుడు ఈ రికార్డు సాధిస్తే టెస్టు క్రికెట్ ఎలా మెరుగవుతుంది? మాకు చెప్పండి. ఇది ఏ విధంగా మంచిది? కాస్త దయతో మాకు జ్ఞానోదయం చేయండి''
''కొన్ని విచిత్ర కారణాలతో టెస్టు క్రికెట్‌ను బీసీసీఐ ప్రోత్సహించట్లేదని విదేశాల్లో అభిప్రాయం ఉంది. ఇది హాస్యాస్పదమైన భావన. ప్రతి సీజన్‌లో భారత్ స్వదేశంలో లేదా విదేశాల్లో అరడజనుకు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. ఐపీఎల్ భారీ విజయాన్ని సాధించడంతో బీసీసీఐ టెస్టు క్రికెట్‌ను ఆదరించట్లేదని విదేశీ మీడియా చేసే ప్రచారంలో వాస్తవం లేదు''
''ఇక జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. దీనికి లార్డ్స్ వేదిక కానుంది. గత రెండు సార్లు మేం ఈ డిక్లరేషన్ విన్నాం. కానీ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరుకోలేదని తెలిసిన తర్వాత టైటిల్ పోరు వేదిక సౌతాంప్టన్ లేదా ఓవల్‌కు మారుతుంటుంది. ఇప్పుడు ఇంగ్లండ్ విజయాలు సాధిస్తుంది. ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ లార్డ్స్ అన్నారు కదా. పాత సామెత చెప్పినట్లుగా.. ఢిల్లీ (లార్డ్స్) అభి దూర్ హై'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.