For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: గంభీర్ ద్రవిడ్ లాగా ఆ డబ్బును వెనక్కి ఇచ్చేస్తాడా?

Sunil Gavaskar: ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆటగాళ్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు చెరో రూ.3 కోట్లు లభిస్తాయి. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకారం.. అసిస్టెంట్ కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, బీసీసీఐ అధికారులకు రూ.25 లక్షలు అందుతాయి. అయితే టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినప్పుడు అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని వెనక్కి ఇచ్చి సహచరులకు సమంగా పంచాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన సునీల్ గవాస్కర్.. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ లాగా గౌతమ్ గంభీర్ తన సపోర్టు స్టాఫ్ కు పంచమని డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడా? అని ప్రశ్నించారు.

2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ద్రవిడ్ తన మిగిలిన సహాయక సిబ్బందితో సమానమైన నగదు బహుమతిని తీసుకున్నాడు. అయితే గంభీర్ ఇంకా అలాంటి ప్రకటన చేయలేదు. "టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టీమిండియాకు బీసీసీఐ నగదు బహుమతిని ప్రకటించింది. అప్పుడు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు ఇతర సిబ్బందితో పోలిస్తే భారీ రివార్డును ప్రకటించింది. కానీ ద్రవిడ్ ఆ మెత్తాన్ని వెనక్కి ఇచ్చేసి సహచరులకు సమానంగా పంచమన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా నిలిచిన తర్వాత కూడా బీసీసీఐ రివార్డును ప్రకటించింది. నగదు బహుమతులను ప్రకటించి పక్షం రోజులు అయింది. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయంలో ద్రవిడ్ మంచి రోల్ మోడల్ కాదా?" అంటు సునీల్ గవాస్కర్ స్పోర్ట్ స్టార్ కోసం కాలంలో ఇలా రాసుకొచ్చారు.

Sunil Gavaskar Questions Gambhir s Response to BCCI s Prize Money Praises Rahul Dravid s Gesture

బీసీసీఐని ప్రశంసించిన సునీల్ గవాస్కర్
ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు క్రికెటర్లకు బహుమతులు ఇచ్చినందుకు గవాస్కర్ బీసీసీఐని ప్రశంసించారు. " భారత ఆటగాళఱ్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత టీమిండియాకు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి బీసీసీఐ రూ. 58 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. గతేడాది జులైలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు రూ.125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్లు సాధించిన విజయాలను అభినందిస్తూ నజరానా ప్రకటించడం అభినందనీయం. ఉదారంగా బహుమతులు ఇవ్వడం అద్భుతం. విజేతల కోసం ఐసీసీ ప్రకటించిన ప్రైజ్ మనీని ఆటగాళ్లు ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ భారీ మొత్తం లభిస్తోంది."అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Story first published: Wednesday, March 26, 2025, 18:25 [IST]
Other articles published on Mar 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+