Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్-కోహ్లికి ఎందుకంత స్పెషల్: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్

దులీప్ ట్రోఫీకి స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దూరమవ్వడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 5 నుంచి మొదలుకానున్న ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌కు రోహిత్, కోహ్లితో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం సరైనదే అని, కానీ కోహ్లి-రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ మండిపడ్డాడు.

ప్రాక్టీస్ లేకుండా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు బరిలోకి దిగితే ఆటపై ప్రభావం పడుతుందని గవాస్కర్ అన్నాడు. సుదీర్ఘ విరామం మజిల్ మెమోరీపై ఎఫెక్ట్ పడుతుందని, అందుకైనా స్టార్ బ్యాటర్లు దులీప్ ట్రోఫీ ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.

Sunil Gavaskar Questions Absence of Virat Kohli and Rohit Sharma from Duleep Trophy

''దులీప్ ట్రోఫీకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో వాళ్లు ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ఆడనున్నారు. అయితే వెన్నెముక జాగ్రత్త కారణంతో బుమ్రా వంటి ప్లేయర్‌కు విశ్రాంతి ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బ్యాటర్లు మైదానంలో సమయాన్ని గడపాలి. ఆటగాళ్లకు వయస్సు 35+కి వచ్చిన తర్వాత పోటీ క్రికెట్‌ను తరుచూ ఆడుతుంటే నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడానికి సాయపడుతుంది''

''కానీ సుదీర్ఘ విరామం ఏర్పడితే, వాళ్ల మజిల్ మెమోరీ కూడా బలహీనపడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో వాళ్లు నెలకొల్పిన ప్రమాణాలను అందుకుకోవడం అంత సులువుగా ఉండదు'' అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, దులీప్ ట్రోఫీలో టీమ్-ఏకు శుభ్‌మన్ గిల్, టీమ్-బీకి అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సీకి రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందించనున్నారు.

Story first published: Monday, August 19, 2024, 15:25 [IST]
Other articles published on Aug 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+