Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : వాళ్లిద్దరూ పరుగులు చేయకపోతే.. సిరీస్‌లో పోటీ ఇవ్వడం కష్టమే.. మాజీ లెజెండ్ వార్నింగ్!

Sunil Gavaskar predicts Team India clean sweap for BGT series

నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులే చేసింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్సులో 400 పరుగుల భారీ స్కోరు చేయగా.. రెండో ఇన్నింగ్సులో ఆసీస్‌ను భారత బౌలర్లు 91 పరుగులకే ఆలౌట్ చేశారు.

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో అదరగొట్టాడు. జడేజా కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్సులోనే ఐదు వికెట్లు తీసుకున్న జడ్డూ.. హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

సిరీస్ క్లీన్ స్వీప్ తప్పదు..

సిరీస్ క్లీన్ స్వీప్ తప్పదు..

తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి చూసిన తర్వాత ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంటుందనే వాళ్ల సంఖ్య మరింత పెరిగింది. మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అయితే మరో అడుగు ముందుకేసి ఈ సిరీస్‌ను టీమిండియా ఏకంగా 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టు జోష్ చూస్తుంటే సిరీస్ ఫలితం ఇదే అని ధీమా వ్యక్తం చేశాడు. అయితే దీన్ని అడ్డుకోవడానికి ఆసీస్ దగ్గర కూడా అవకాశం ఉందన్నాడు.

తొలి టెస్టులో ఫెయిల్..

తొలి టెస్టులో ఫెయిల్..

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆకట్టుకున్న ఆటగాళ్లు ఇద్దరే. వాళ్లే స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్. వీళ్లిద్దరూ ఆసీస్ మిడిలార్డర్ వెన్నెముకలు. భారత బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీళ్లిద్దరూ మొదటి ఇన్నింగ్సులో చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ మంచి ఆరంభాలు కూడా దక్కాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం ఇద్దరూ విఫలమయ్యారు. ఇది ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీసింది.

వాళ్లిద్దరే కీలకం..

వాళ్లిద్దరే కీలకం..

ఇదే విషయాన్ని ఎత్తి చూపిన గవాస్కర్.. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో కూడా వీళ్లిద్దరే ఆసీస్‌కు కీలకం కానున్నారని చెప్పాడు. కేవలం రెండో టెస్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే వాళ్లిద్దరూ భారీ స్కోర్లు చేయక తప్పదని చెప్పాడు. 'నన్నడిగితే ఈ సిరీస్‌ను 4-0తో భారత్ గెలిస్తుందని చెప్తా. ఆస్ట్రేలియా ఓడిన విధానం చూస్తే.. వాళ్లకు గ్యారంటీగా రెండో టెస్టులో అద్భుతమైన ఓపెనింగ్ కావల్సి ఉంటుంది. అయితే స్మిత్, లేదంటే లబుషేన్ ఎవరో ఒకరు భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. అది జరగలేదంటే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ' అని గవాస్కర్ తేల్చిచెప్పాడు.

జడ్డూ సూపర్..

జడ్డూ సూపర్..

గాయం నుంచి కోలుకొని చాలా కాలం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రవీంద్ర జడేజా.. తొలి టెస్టులో అదరగొట్టాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. దీనిపై కూడా స్పందించిన సన్నీ.. 'భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఆటగాడు తను. జడేజా పునరాగమనం అదిరిపోయింది. మిడాఫ్‌లో ఎక్కువగా ఉండటంతో అతని ఫీల్డింగ్ అంతగా చూడలేకపోయాం. కానీ బౌలర్‌గా కరెక్ట్‌గా బౌలింగ్ చేశాడు. ఇక బ్యాటర్‌గా అయితే.. తను మరెన్నో పరుగులు చేస్తాననే ధీమా ఇచ్చాడు. అతని వికెట్ కావాలంటే ప్రత్యర్థి జట్టు చాలా కష్టపడాల్సి వచ్చింది' అని మెచ్చుకున్నాడు.

Story first published: Sunday, February 12, 2023, 21:40 [IST]
Other articles published on Feb 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+