Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మామూలోడు కాదు.. ధోనీ గుర్తొచ్చాడు: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ యువ బ్యాటర్ ముకుల్ చౌదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తీరును సునీల్ గవాస్కర్ కొనియాడారు. "ప్రతిరోజూ ఐపీఎల్‌లో ఓ కొత్త మెరుపును చూస్తున్నాం. ముకుల్ వంటి యువ ఆటగాడు ఏ మాత్రం భయం లేకుండా, ఒత్తిడిలో తన జట్టును గెలిపించడం అద్భుతం. రాజస్థాన్ తరఫున దేశవాళీ క్రికెట్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఈ కుర్రాడు.. ఐపీఎల్‌లోకి వచ్చి రాత్రికి రాత్రే అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాడు" అని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు.

ధోనీని గుర్తు చేసిన హెలికాప్టర్ షాట్
ముకుల్ చౌదరి బ్యాటింగ్‌లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సునీల్ గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రీజులోకి వచ్చిన తర్వాత ముకుల్ చౌదరి కాసేపు సమయం తీసుకుని.. సెట్ అయిన తర్వాత బాల్స్‌ను స్టేడియం బయటకు పంపడం మెచ్చుకోదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ముకుల్ చౌదరి ఆడిన హెలికాప్టర్ షాట్ చూస్తుంటే ఎంఎస్ ధోనీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని గవాస్కర్ అన్నారు. తనకు షాట్లు కొట్టగలననే నమ్మకం ఉండబట్టే ముకుల్ చౌదరి సింగిల్స్ తీయడానికి నిరాకరించి జట్టును గెలిపించాడని పేర్కొన్నారు.

Sunil Gavaskar Praises Mukul Choudhary Dhoni-Style Hitting Worried About Nicholas Pooran

స్టార్ ప్లేయర్లు విఫలమైనా లక్నోదే విజయం
లక్నో జట్టుకు ఈ విజయం చాలా కీలకమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్‌క్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వంటి ప్రధాన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. యువ ఆటగాళ్ల అండతో లక్నో గట్టెక్కిందని చెప్పారు. గత సీజన్లో కేవలం స్టార్ ప్లేయర్లపైనే ఆధారపడిన లక్నో.. ఈ సారి వారు విఫలమైనా గెలవగలిగే సత్తా చాటుకోవడం ఆ జట్టుకు సానుకూల అంశమని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు.

లక్నో గెలిచినా పూరన్ టెన్షన్
లక్నో విజయం సాధించినప్పటికీ.. నికోలస్ పూరన్ ఆటతీరుపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. "పూరన్ ఫామ్ లక్నోకు ఆందోళన కలిగించే విషయం. కేకేఆర్ మ్యాచ్‌లో అతను బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయాడు. ప్రతి బంతిని బాదాలనే ప్రయత్నంలో నికోలస్ పూరన్ అవుట్ ఆఫ్ టచ్‌గా కనిపించాడు. మనం చూసిన విధ్వంసకర పూరన్ ఇతను కాదు. లక్నో జట్టు యాజమాన్యం పూరన్‌లో తిరిగి ఆత్మవిశ్వాసం నింపే మార్గాన్ని వెతకాలి" అని సునీల్ గవాస్కర్ సూచించారు.

ముకుల్ చౌదరి ఓ కొత్త స్టార్
మొత్తానికి ముకుల్ చౌదరి రూపంలో ఐపీఎల్ 2026 ఓ కొత్త ఫినిషర్‌ను కనుగొందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఈ యువ ఆటగాడి పోరాట పటిమ చూస్తుంటే భవిష్యత్తులో ముకుల్ చౌదరి లక్నో జట్టుకు వెన్నెముకగా మారే అవకాశం ఉందని ముకుల్ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ రిపోర్ట్, గవాస్కర్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Story first published: Friday, April 10, 2026, 13:37 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+