Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final ఫైనల్ ఆడే జట్టు ఇదే అంటున్న సునీల్ గవాస్కర్.. సమస్య అదేనట!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టు ముందు ఒకే ఒక సమస్య ఉందని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. సరైన జట్టును ఎంపిక చేస్తే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం ఖాయమని పలువురు నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఎంపికలో భారత్ ముందు ఒకే ఒక సవాల్ ఉందని గవాస్కర్ చెప్పాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవాస్కర్ తను ఎంపిక చేసే జట్టు ఏదో వెల్లడించాడు. 'నేను ముందు బ్యాటింగ్ గురించి మాట్లాడతా. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటా. మూడో స్థానంలో ఛటేశ్వర్ పుజారా, నాలుగులో విరాట్ కోహ్లీ. ఇక ఐదో ప్లేస్‌లో అజింక్య రహానే కన్ఫర్మ్. అయితే ఆరో స్థానంలో ఎవరు వస్తారనేదే సమస్యగా ఉంది' అని గవాస్కర్ వివరించాడు.

Sunil Gavaskar Playing XI of Team India for WTC Final

వికెట్ కీపర్లలో ఇషాన్ కిషన్ కన్నా కూడా శ్రీకర్ భరత్‌కే ఆడే అవకాశం ఎక్కువగా ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'నాకు తెలిసి ఆరో స్థానంలో భరత్ లేదా కిషన్ ఆడతారు. ఇప్పటి వరకు ఆడుతూ వస్తున్నాడు కాబట్టి భరత్‌కే ఈ అవకాశం దక్కొచ్చు. కాబట్టి ఆరో స్థానంలో భరత్‌ వస్తాడు' అని చెప్పాడు. రిషభ్ పంత్ గాయం తర్వాత టీమిండియా అతన్ని చాలా బాగా మిస్ అవుతున్న సంగతి తెలిసిందే.

'ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దర్నీ టీం మేనేజ్‌మెంట్ ఆడిస్తుందని అనుకుంటున్నా. కాబట్టి ఏడో స్థానంలో జడేజా, ఎనిమిదిలో అశ్విన్ ఉంటారు. చివర్లో వరుసగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ కన్ఫర్మ్. ఇక ఉమేష్ కన్నా నా ఓటు శార్దూల్‌కే వేస్తా' అని చెప్పాడు. ఇదే తను సెలెక్ట్ చేసే జట్టు అని చెప్పాడు.

గవాస్కర్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

Story first published: Sunday, June 4, 2023, 20:22 [IST]
Other articles published on Jun 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+