
ఆర్సీబీ కేప్టెన్‌గానూ
ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోక ముందే మరో సంచలన ప్రకటన చేశాడు కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా కూడా తనకు ఇదే చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని ప్రకటించాడు. ఈ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ ముగిసిన తరువాత రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కేప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పబోతోన్నాని చెప్పాడు. ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు.
అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఓ ఆటగాడిగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు అబుధాబి షేక్ జయేద్ స్టేడియం నుంచి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు విరాట్ కోహ్లీ.

ముగ్గురి పేర్లను సూచించిన గవాస్కర్
విరాట్ కోహ్లీ కేప్టెన్సీ నుంచి తప్పుకొన్న తరువాత రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అందుతాయనేది ఇప్పటికే స్పష్టమైంది. కోహ్లీ తరువాత జట్టులో అత్యంత సీనియర్ కావడం, నిలకడగా రాణిస్తుండటం, జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉండటం వంటి అనేక కారణాల వల్ల రోహిత్ శర్మ.. టీమిండియాకు భవిష్యత్ కేప్టెన్‌గా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇక అది వాస్తవ రూపాన్ని దాల్చబోతోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత- ఏ క్షణమైనా విరాట్ కోహ్లీ తప్పుకోవడం ఖాయం. అతని స్థానంలో రోహిత్ ఎంపిక కావడం అంతే ఖాయం.

అయిదుసార్లు ఛాంపియన్‌గా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్‌ను అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు రోహిత్ శర్మ. తన కేప్టెన్సీలో జట్టు ఎలాంటి విజయాలను సాధిస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యాన్ని వహిస్తోన్న విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటిదాకా తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. టైటిల్‌ను ముద్దాడలేకపోయాడు. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య ఉన్న తేడాను ఐపీఎల్ క్రిస్టల్ క్లియర్‌గా ప్రతిఫలింపజేసింది.

కోహ్లీ వారసుడు రోహిత్
తాజాగా- లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ శర్మకే ఓటు వేశాడు. విరాట్ తరువాత టీమిండియా జట్టును నడిపించగల సమర్థత, శక్తియుక్తులు రోహిత్ శర్మకు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు. అభిమానులందరి మనసులో ఉండే మాటనే గవాస్కర్ కూడా బయటపెట్టాడు. అదే సమయంలో వైస్ కేప్టెన్‌గా ఎవరనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.
కేఎల్ రాహుల్‌ను వైస్ కేప్టెన్‌గా అపాయింట్ చేయాలని సూచించారు. అదే సమయంలో మరో పేరును కూడా గవాస్కర్ తెర మీదకి తెచ్చారు. ఆ పేరే రిషభ్ పంత్. రిషభ్ పంత్ సైతం వైఎస్ కేప్టెన్‌గా సెలెక్ట్ చేయడానికి అర్హుడని, అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications












