Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ కెప్టెన్లుగా ఉండగల సమర్థులు వీరే: సునీల్ గవాస్కర్

IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా భవిష్యత్ కెప్టెన్ గురించి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ భారత కెప్టెన్లకు శిక్షణ ఇవ్వడానికి ఐపీఎల్ సరైనదని ఆయన అన్నారు.

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహించగలడని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. రిషబ్ పంత్ అతడి డిప్యూటీ కావచ్చన్నారు. ఇది కాకుండా శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి ఇతర ఆటగాళ్లు కెప్టెన్లుగా సిద్ధం కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని గవాస్కర్ అన్నారు.

Sunil Gavaskar Picks Gill Pant Iyer as Future Test Captains After Rohit s Retirement

స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ రూమ్‌లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ గవాస్కర్ మాట్లాడుతూ.. భవిష్యత్ కెప్టెన్లు మన సూపర్ కెప్టెన్ల(ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) స్థాయికి చేరుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. వారందరూ కెప్టెన్సీకి భిన్నమైన విధానాన్ని తీసుకున్నారని చెప్పారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ముగ్గురు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్య‌ర్‌లను చూసినప్పుడు.. ధోని, రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లను కలిసి చూసినట్లు అనిపిస్తుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. గిల్ బహుశా ఎక్కువ పోటీతత్వం కలిగి ఉంటాడన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెంటనే అంపైర్‌ను అడుగుతాడన్నారు.

ఐపీఎల్ గురించి ఇలా అన్నాడు..
అయితే రిషబ్ పంత్ స్టంప్స్ వెనుక నుంచి మ్యాచ్‌లో చాలా ఉత్సాహంగా ఉంటున్నాడని లిటిల్ మాస్టర్ అన్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడన్నారు. ఈ ముగ్గురూ కెప్టెన్సీ చేసిన విధానంలో చాలా సానుకూలతను తెచ్చారని చెప్పారు. కెప్టెన్సీకి ఐపీఎల్ అత్యుత్తమ శిక్షణా మైదానమంటూ పేర్కొన్నారు. రోహిట్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. దీనిని పూరించడానికి బీసీసీఐకి చాలా సమయం పడుతుంది. గౌతమ్ గంభీర్ దీని కోసం తన పనిని ప్రారంభించాడు.

Story first published: Saturday, May 17, 2025, 10:06 [IST]
Other articles published on May 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+