Sunil Gavaskar: ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడంపైనే ఆ యార్కర్ స్పెషలిస్ట్ ఫోకస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్నటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 13పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. చెన్నై కేవలం 2వికెట్లు కోల్పోయి 202పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్లో నటరాజన్ ఒక్కడే ఆ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లలో 2/42 ప్రదర్శన చేశాడు. కచ్చితమైన యార్కర్లను వేయడంలో, డెత్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయడంలో నటరాజన్ మంచి బౌలర్ అని, గాయాల బెడద తర్వాత అతను ప్రస్తుత ఐపీఎల్లో అద్భుతమైన పునరాగమనం చేశాడని క్రికెట్ దిగ్గజం, విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆడిన 9 మ్యాచ్‌ల్లో 17వికెట్లు తీసిన నటరాజన్ చక్కని రిథమ్‌లో కన్పిస్తున్నాడని పేర్కొన్నాడు. అలాగే ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో అతను భారత జట్టు సెలెక్షన్ పోటీలో ఉంటాడని పేర్కొన్నాడు.
"నటరాజన్ యార్కర్ స్పెషలిస్ట్ అని మనకు తెలిసిందే. కానీ ఇటీవల అతని బౌలింగ్లో మనం చూస్తున్న వేరియేషన్ ఏంటంటే.. అతను బంతిని ఆలస్యంగా డెలివరీ చేస్తున్నాడు. బ్యాటర్ల టచ్‌ను దెబ్బతీయడానికి నటరాజన్ ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నాడు. అతను బాగా రాణిస్తుండడం ఆనందంగా ఉంది. కొంతకాలంగా టీమిండియాకు అతను దూరమయ్యాడు. అతన్ని మళ్లీ టీమిండియాకు ఎంపిక చేసే ఆటగాళ్ల లిస్టులో ఉంచడం మంచిది. ఎందుకంటే అతను చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. 16నుంచి 20వరకు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల సామర్థ్యమున్న ప్లేయర్లలో అతను ఉంటాడు' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న ప్లేయర్లలో నటరాజన్ ఒకడు. గాయం నుండి కోలుకున్న తర్వాత ఈ పేసర్ అందుకున్న కాన్ఫిడెన్స్‌ను గవాస్కర్ కొనియాడాడు. '2020ఐపీఎల్ ఎడిషన్‌లో నటరాజన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 8.02ఎకానమీతో 16వికెట్లు తీశాడు. అతను 2021సీజన్లో గాయాల వల్ల కొంత గాడి తప్పాడు. బహుశా గాయం వల్లే తన ఆటలో కొంత సమర్థత కన్పించలేకపోచ్చు. కానీ ప్రస్తుతం అతను పూర్తి సమర్థతతో బౌలింగ్ చేస్తున్నాడు.
ఆత్మవిశ్వాసంతో కన్పిస్తున్నాడు. కొన్ని రోజులు విరామం తీసుకున్న అనంతరం అతను ఫ్రెష్ మైండ్ సెట్‌తో ఉత్సాహంగా ఉన్నాడు. మరో నాలుగు నెలల్లో టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉందని గుర్తించాడు. అతను టీమిండియా తరఫున ఆస్ట్రేలియా విమానం ఎక్కాలనుకుంటున్నాడు' అని గవాస్కర్ నటరాజన్ కాన్ఫిడెన్స్, బౌలింగ్ తీరును మెచ్చుకున్నాడు. నటరాజన్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ (19వికెట్లు) తర్వాత కుల్దీప్ యాదవ్(17వికెట్లు)తో సమానంగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications