Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunil Gavaskar Love Story: గవాస్కర్ మంచి ఆటగాడే.. అభిమానినే పటాయించాడు!

Sunil Gavaskar Love Story: భారత క్రికెట్ దిగ్గజాలలో సునీల్ గవాస్కర్ పేరు వినగానే ప్రతి ఒక్కరి కళ్లలో గౌరవం కనిపిస్తుంది. ఈ గొప్ప క్రికెటర్ స్టేడియంలో చరిత్ర సృష్టించడమే కాకుండా.. తన జీవితంలో ఓ సినిమా కథ కంటే తక్కువ కానీ ప్రేమకథను లిఖించారు. ఓ సాధారణ ఫ్యాన్ మూమెంట్‌గా మొదలైన ప్రేమ.. పెళ్లి బంధం వరకు ఎలా చేరిందో తెలుసుకుందాం.

ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు వచ్చిన మార్షనీల్
ఇది 1973 నాటి విషయం. భారత క్రికెట్ ఇంకా కొత్తగా వేళ్లూనుకుంటున్న సమయం. ఢిల్లీలో చదువుతున్న మార్షనీల్ మెహ్రోత్రా క్రికెట్‌కు వీరాభిమాని.. ఆమె అభిమానించే క్రికెటర్లలో సునీల్ గవాస్కర్ పేరు ముందుండేది. ఓ రోజు తన స్నేహితురాళ్లతో కలిసి మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆమెకు ఆ రోజు తన జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుందని తెలియదు. లంచ్ బ్రేక్ సమయంలో స్నేహితురాళ్లంతా కలిసి ఆటగాళ్ల నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్షనీల్ ధైర్యం చేసి గుంపులో నుంచి ముందుకు వెళ్లి నేరుగా సునీల్ గవాస్కర్ వద్దకు చేరుకుంది. సునీల్ చిరునవ్వుతో ఒక కాగితంపై సంతకం చేశారు. అది కొన్ని సెకన్లు మాత్రమే అయినా, ఆ క్షణం సునీల్ గవాస్కర్ దృష్టిలో చాలా ప్రత్యేకం. మార్షనీల్‌ను చూసిన గవాస్కర్ కళ్లు ఆమెపై నుంచి అస్సలు తిప్పలేదు.

Sunil Gavaskar Love Story From Fan Moment to Lifelong Bond

పెరిగిన పరిచయం
ఆ తర్వాత విధి వారిద్దరి దారులను కలిపింది. మార్షనీల్ మెహ్రోత్రా కుటుంబం నివసించే కాన్పూర్ నగరానికి సునీల్ గవాస్కర్ రాకపోకలు పెరిగాయి. మ్యాచ్‌ల పేరుతో, ఇతర కార్యక్రమాల పేరుతో వీరిద్దరి మధ్య మీటింగ్‌లు పెరిగాయి. అంతకుముందు కేవలం క్రికెట్ చుట్టూ తిరిగే సునీల్ గవాస్కర్ జీవితంలో ఇప్పుడు మార్షనీల్ అనే కొత్త పేరు చేరింది.

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్రపోజ్
క్రమంగా వీరి రిలేషన్ మరింత బలపడింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా సునీల్ గవాస్కర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రజల కరతాళ ధ్వనుల మధ్య, మ్యాచ్ ముగిసిన తర్వాత సునీల్ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అడుగు వేశారు. అక్కడే అందరి ముందు మార్షనీల్ కుటుంబ సభ్యులు ఉండగానే ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచి ప్రపోజ్ చేశారు. ఆ క్షణం ఏదో సినిమా దృశ్యంలా అనిపించింది. మైదానంలో నిలబడిన ఆ స్టార్ బ్యాటర్.. తన అభిమానికి జీవితాంతం తోడుగా ఉండే వాగ్దానం చేయాలని కోరుకున్నారు. మార్షనీల్ ముఖంలో చిరునవ్వు, ఆమె సమాధానం "అవును" అని వచ్చింది. ఇంకేముంది.. ఇద్దరి మనసులు కలిసిపోయాయి.

ఆ తర్వాత సెప్టెంబర్ 23, 1974న సునీల్ గవాస్కర్, మార్షనీల్ శాశ్వతంగా ఒకటయ్యారు. ఆ రోజుల్లో ఓ క్రికెట్ స్టార్ అభిమానిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ నిజమైన ప్రేమకు ఎలాంటి గుర్తింపు, హోదా అడ్డు కాదని గవాస్కర్, మార్షనీల్ నిరూపించారు. నేటికీ వారి ప్రేమకథ గురించి చెప్పుకునేటప్పుడు, ఆటోగ్రాఫ్‌తో మొదలైన కథ, జీవితకాల బంధంగా మారిందని, ఇది క్రికెట్ ప్రపంచంలోని అత్యంత మధురమైన, అసాధారణమైన 'ఫ్యాన్ టు వైఫ్ లవ్ స్టోరీ' అని ప్రజలు అంటారు.

Story first published: Tuesday, October 7, 2025, 11:51 [IST]
Other articles published on Oct 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+