Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ కుర్రాడి కంట్రోల్ వేరే లెవెల్: సునీల్ గవాస్కర్

ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన అరంగేట్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన ఈ 23 ఏళ్ల యువ ఆటగాడి బౌలింగ్‌కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ముగ్ధుడయ్యారు. మానవ్ సుతార్ బౌలింగ్ కంట్రోల్ , అతని సింపుల్ యాక్షన్‌ను కొనియాడిన లిటిల్ మాస్టర్.. ఈ యువ బౌలర్ భారత క్రికెట్లో సుదీర్ఘ భవిష్యత్తును కలిగి ఉన్నాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

పిచ్ కాదు.. స్కిల్ ముఖ్యం
ఇండియాలో స్పిన్నర్లు సాధించే విజయాల వెనుక కేవలం ఇక్కడి టర్నింగ్ పిచ్‌ల సహకారమే ఉంటుందని విమర్శించే వారికి సునీల్ గవాస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. "భారత్‌లో స్పిన్నర్లకు పరిస్థితులు అనుకూలిస్తాయని, పిచ్ నుంచి సాయం లభిస్తుందని చాలా మంది అంటుంటారు. కానీ నేను చెబుతున్నాను.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ను కాసేపు పక్కన పెట్టండి. బౌలింగ్ అంటే కేవలం నైపుణ్యం (స్కిల్), నియంత్రణ (కంట్రోల్).. ఈ యువ ఆటగాడు మైదానంలో సరిగ్గా అదే చేసి చూపించాడు" అని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు.

Sunil Gavaskar Lavishes Praise on Debutant Manav Suthar After His 6-Wicket Haul vs Afghanistan

మానవ్ సుతార్ సింపుల్ యాక్షన్‌పై విశ్లేషణ
మానవ్ సుతార్ బౌలింగ్ యాక్షన్‌ను గవాస్కర్ ప్రత్యేకంగా విశ్లేషించారు. "మానవ్ సుతార్ బౌలింగ్ యాక్షన్ చాలా సాధారణంగా, సింపుల్‌గా ఉంటుంది. ఈ సింపుల్ యాక్షనే అతను వికెట్లపై అద్భుతమైన నియంత్రణతో, ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల బ్యాటర్లను నిరంతరం ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో వేధిస్తూ, వారిపై ఒత్తిడి పెంచడంలో అతను విజయవంతమయ్యాడు" అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

మూడో రోజే టీమిండియా రికార్డు విక్టరీ
ముల్లా‌న్ పూర్ మైదానంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌పై టీమిండియా మొదటి రోజు నుంచే పూర్తి పట్టు సాధించింది. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 564 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్.. మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలానికి చేతులెత్తేసి కేవలం 152 పరుగులకే కుప్పకూలింది.

మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా 412 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్‌కు ఫాలోఆన్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆఫ్ఘన్ జట్టును భారత బౌలర్లు కోలుకోనివ్వలేదు. ఈసారి వాషింగ్టన్ సుందర్ (4 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు) జోడి ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఆర్డర్ నడుం విరిచింది. దీనితో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Monday, June 8, 2026, 17:38 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+