Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్‌కు చోటు, రహానేపై వేటు: సెలక్టర్లపై సన్నీ మండిపాటు

హైదరాబాద్: బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. శనివారం నుంచి ఆసీస్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌ కోసం రహానేను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆసీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఏ ప్రామాణికంగా భారత్ జట్టు ఎంపిక జరిగిందో అర్ధం కావడం లేదన్నారు.

ఇటీవలే ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రహానే వరుసగా నాలుగు హాఫ్ పెంచరీలు సాధించి, మంచి ఫామ్ ఉన్నా... అతన్ని టీ20లకు ఎంపిక చేయక లేదంటే సెలక్షన్ కమిటీ తీరు సరిగా లేదని అన్నారు. 'ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రహానే రాణించాడు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫామ్‌లో రహానేను టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు' అని ప్రశ్నించారు.

 కేఎల్ రాహుల్‌కు చోటు దక్కడంపై గవాస్కర్

కేఎల్ రాహుల్‌కు చోటు దక్కడంపై గవాస్కర్

అదే సమయంలో కేఎల్ రాహుల్‌కు స్థానం కల్పించడాన్ని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. 'కేఎల్ రాహుల్‌ను టీ20 సిరిస్‌కి ఎంపిక చేశారు. రాహుల్ మంచి ఆటగాడే.. కానీ ఐదు వన్డేల సిరీస్‌లో ఒక గేమ్ కూడా అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అలాంటప్పుడు టీ20 సిరీస్‌కు రాహుల్ జట్టులో ఎందుకు?' అని నిలదీశారు.

 వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు

వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు

వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలను చేసిన రహానేకు స్థానం కల్పించి ఉండాల్సిందని అన్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో రహానే వరుసగా 5, 55, 70, 53, 61 పరుగులు చేసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి వన్డే మినహా మిగతా మ్యాచ్‌ల్లో రహానే హాఫ్ సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే.

సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా

సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా

మరోవైపు మూడు టీ20ల సిరిస్‌లో తనకు చోటు దక్కకపోవడంపై రహానే కూడా స్పందించాడు. తానెప్పుడూ సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కని తర్వాత రహానే మీడియాతో పేర్కొన్నాడు. జట్టులో ఎప్పుడూ పోటీ ఉంటేనే ప్రతీ ఒక్కరూ వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి కష్టపడతారని రహానే స్సష్టం చేశాడు.

 భారత జట్టు:

భారత జట్టు:

విరాట్ కోహ్లీ (Capt), రోహిత్ శర్మ (VC), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని (wk), హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశీష్ నెహ్రా, అక్షర పటేల్

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+