డబుల్ మీనింగ్ బాబోయ్: లాక్‌డౌన్ టైమ్‌లో అనూష్కతో ప్రాక్టీస్: కోహ్లీ క్యాచ్ డ్రాప్స్‌పై గవాస్కర్

ముంబై: పుండు కారం చల్లడం, మంటలను చల్లార్చడానికి బదులుగా కాసింత కిరోసిన్ పోయడం.. వంటి ఉపమానాల గురించి ఇప్పటిదాకా వినే ఉంటాం. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూడాల్సి వస్తోంది. అసలే- రెండు బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్ డ్రాప్స్‌తో మంటెక్కి ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్. ఇంకేముంది. తమ అసహనాన్ని , ఆగ్రహాన్ని.. ఆయన మీదికి డైవర్ట్ చేసేశారు. సన్నీభాయ్ కామెంటేటర్‌గా పనికాడంటూ భగ్గుమంటున్నారు. ఆయనకు వెంటనే గేట్‌పాస్ ఇచ్చి కామెంటరీ బాక్స్ నుంచి ఇంటికి పంపించాలనీ డిమాండ్ చేస్తున్నారు.
కోహ్లీపై ఎందుకీ కామెంట్స్..
ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాసిరకంగా ఫీల్డింగ్ చేశాడు. బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్‌లను వదిలేశాడు. దాని ఫలితంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ భారీ స్కోరును సాధించింది. సరే- భారీ స్కోర్ చేసినప్పటికీ.. దాన్ని ఛేజ్ చేస్తారని ఆశించారు రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు. తనకు టార్గెట్ అంటూ పెడితే చెలరేగిపోయి ఆడే కోహ్లీ.. ఏ మాత్రం రాణించలేకపోయాడు.
అసలేంటీ కామెంట్స్..
అయిదు బంతులను మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ.. షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే. కొండంత లక్ష్యం ముందున్నప్పటికీ.. దాన్ని అందుకునే స్థాయిలో ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ అవుటైన వెంటనే టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.. ఓ హాట్ కామెంట్ చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. `లాక్‌డౌన్ సమయంలో నేను ఇంట్లో అనూష్య శర్మ బంతులతో ప్రాక్టీస్ చేశా` అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు. అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనూష్మ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.
కామెంటేటర్‌గా తొలగించాలంటూ..
సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్‌ను ఉటంకిస్తూ.. ఆయనపై విరుచుకుపడుతున్నారు విరూష్క ఫ్యాన్స్. అంత పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. సునీల్ గవాస్కర్ హుందాగా వ్యవహరించట్లేదని మండిపడుతున్నారు. ఆయనను కామెంటేటర్ హోదా నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారు. అలాంటి డబుల్ మీనింగ్ అర్థాలతో వ్యాఖ్యానాలు చేయడం.. పైగా ఓ పబ్లిక్ డయాస్ మీద అలాంటి కామెంటరీ సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఆయన కామెంట్స్‌ను తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications