ఓపిక ప‌ట్టండి.. టీమిండియాలో పెద్ద లోటు ఉంది! గ‌వాస్క‌ర్ ఆస‌క్తిర వ్యాఖ్య‌లు

సౌతాఫ్రికాతో తొలి వ‌న్డేలో భారత జ‌ట్టు ఓట‌మిపై టీమిండియా దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేశారు. తొలి వ‌న్డేలో టీమిండియా ఓట‌మితో నిరాశ‌లో ఉన్న అభిమానుల‌ను ఉద్దేశించి ఓపిక‌తో ఉండాల‌ని చెప్పారు. సిరీస్ మొత్తం ముగిసే వ‌ర‌కు వేచి ఉండాల‌ని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు అంతా టీమిండియాకు మ‌ద్ద‌తుగా ఉండాలని ఆయ‌న కోరారు. అలాగే ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం టీమిండియాలో ఉన్న ఓ పెద్ద లోపాన్ని సునీల్ గ‌వాస్క‌ర్ ఎత్తి చూపారు.

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో స‌రైన ఆల్‌రౌండ‌ర్ లేడ‌ని చెప్పారు. ఆల్‌రౌండ‌ర్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తార‌ని తెలిపారు. చాలా మంది బ్యాట‌ర్లు బౌలింగ్ చేయ‌గ‌ల‌ర‌ని, అలాగే బౌల‌ర్లు బ్యాటింగ్ చేయ‌ల‌గ‌ల‌ర‌ని చెప్పుకొచ్చారు. జ‌ట్టులో 6, 7, 8 స్థానాల్లో విజ‌యవంత‌మైన ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌డం అవ‌స‌ర‌మ‌న్నారు.

 ఆల్‌రౌండ‌ర్ల కొర‌త‌

ఆల్‌రౌండ‌ర్ల కొర‌త‌

భార‌త్ జ‌ట్టులో రెండు, మూడేళ్లుగా ఆల్‌రౌండ‌ర్ల కొర‌త ఉంద‌ని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు. దీంతో కెప్టెన్‌కు, జ‌ట్టుకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పారు. గ‌తంలో యువ‌రాజ్ సింగ్, సురేష్ రైనా వంటి వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాకుండా 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను, 2011 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను టీమిండియా గెలిచిన‌ప్పుడు జ‌ట్టులో అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్లు ఉన్నార‌ని సునీల్ గ‌వాస్క‌ర్ తెలిపారు. అందుకే ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు విజ‌య‌వంతంగా రాణించాలంటే స‌రైన ఆల్‌రౌండ‌ర్లు జ‌ట్టులో ఉండ‌డం అవ‌స‌ర‌మ‌న్నాడు.

రాహుల్ వ్యూహాలు అర్థం కాలేదు

రాహుల్ వ్యూహాలు అర్థం కాలేదు

అలాగే తొలి వ‌న్డేలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై కూడా సునీల్ గ‌వాస్క‌ర్‌ స్పందించారు. తొలి వ‌న్డేలో రాహుల్ వ్యూహాలెంటో త‌న‌కు అర్థం కాలేద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌మాద‌కరంగా మారిన బ‌వుమా- డ‌స్సేన్ భాగ‌స్వామ్యాన్ని విడ‌దీయ‌డానికి భువ‌నేశ్వ‌ర్, బుమ్రా, వెంక‌టేశ్ అయ్య‌ర్‌తో ఎక్కువ ఓవ‌ర్లు వేయించాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే భారీ భాగ‌స్వామ్యాలు న‌మోద‌వుతున్న‌ప్పుడు ఎటువంటి కెప్టెన్‌కైనా ఆలోచించ‌చ‌డం క‌ష్ట‌మే అన్నారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రాహుల్ కెప్టెన్‌గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడ‌ని, అందుకే రాబోయే మ్యాచ్‌ల్లో విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు గ‌వాస్క‌ర్ తెలిపారు.

నేడే రెండో వ‌న్డే

నేడే రెండో వ‌న్డే

కాగా నేడు భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య నేడు రెండో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పార్ల్ వేదిక‌గా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే తొలి వ‌న్డేలో ఓడి సిరీస్‌లో వెనుక‌బ‌డ్డ టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాలని ప‌ట్టుద‌ల‌గా ఉంది. తొలి వ‌న్డేలో బ‌రిలోకి దిగిన జ‌ట్టులో ప‌లు మార్పుల‌తో రెండో వ‌న్డేలో బరిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇక తొలి వ‌న్డేలో మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యంతో ఓట‌మి పాలైన భార‌త్ జ‌ట్టు రెండో వ‌న్డేలో మిడిలార్డ‌ర్ రాణించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అలాగే బౌల‌ర్లు కూడా స‌త్తా చాటాల‌ని కోరుకుంటోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 21, 2022, 12:22 [IST]
Other articles published on Jan 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X