అమితాబ్ 'కేబీసీ' స్టైల్‌ను ఫాలో అయిన గవాస్కర్.. కామెంటరీ బాక్స్‌లో హల్చల్!!

బెంగళూరు: క్రికెట్ ఆటలో సాధారణంగా మైదానం, డ్రెసింగ్ రూంలలో మాత్రమే సరదా ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. మ్యాచ్ జరిగే సమయంలో కామెంటేటర్లు మ్యాచ్ డీటెయిల్స్, పాత రికార్డులు, ఆటగాళ్ల ఫామ్ వంటి వాటితో కామెంటరీ బాక్స్‌లో బిజీగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కామెంటరీ బాక్స్‌లో కామెంటేటర్లు సరదాగా ఉంటారు. తాజాగా ఇలాంటి సరదా ఘటనే భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో చోటుచేసుకుంది.

అమితాబ్ స్టైల్ ఫాలో:
చివరి టీ20లో కామెంటరీ బాక్స్‌లో ఉన్న టీమిండియాకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన సరదా చతురతను అభిమానులకు చూపించాడు. అచ్చం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను అనుకరించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి వచ్చిన పోటీ దారులికి అమితాబ్ ఏ విధంగా ప్రశ్నలు వేస్తాడో.. అచ్చం అలా అనుకరించిన గవాస్కర్ అభిమానులకు ఓ ప్రశ్నను సంధించాడు. 'భారత బ్యాటింగ్ ఆర్డర్ నాలుగో స్థానంలో ఎవరు రావాలి' అంటూ అమితాబ్ స్టైల్‌ను ఫాలో అయ్యాడు. పక్కనే ఉన్న మరో భారత కామెంటేటర్ హర్షా భోగ్లే వెంటనే నవ్వులు పూయించాడు.
కోటి రూపాయల ప్రశ్న:
ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి బీసీసీఐ సైతం ఓ కామెంట్‌ను పోస్ట్ చేసింది. 'ఇది సన్నీజీ నుంచి వచ్చిన బంగారం. కేబీసీ అనువాదం ఎలా ఉంది. ఇది సన్నీ జీ స్టైల్' అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్టుకు భారత అభిమానుల నుండి రకరకాల కామెంట్లు వచ్చాయి. ఇది గవాస్కర్ 'కోటి రూపాయల ప్రశ్న' అని నెటిజన్ కామెంట్ చేయగా.. 'గవాస్కరా.. మజాకా' అని మరొ నెటిజన్ ట్వీట్ చేసాడు.

నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేడు:
గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేడు. ఈ స్థానంలో ఎందరినో పరీక్షించినా.. ఎవరూ సరిగా సెట్ కాలేదు. అంబటి రాయుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరకు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఈ స్థానంలో పంపుతున్నా.. అతను విఫలమవుతున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని గవాస్కర్ అభిమానులకు ప్రశ్నను సంధించాడు. ఈ సమయంలో క్రీజులో పంత్ ఉండడం విశేషం.

భారత బ్యాట్స్‌మెన్ విఫలం:
ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ త్వరగానే పెవిలియాక్ చేరినా.. ధావన్, కోహ్లీ ధాటిగా ఆడలేకపోయారు. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్ అందరూ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. శిఖర్ ధావన్ (36) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదినుంచే భారత బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ డికాక్ (79 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి సునాయసంగా విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ప్రొటీస్ మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications