Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్‌పై సీనియర్లు: పాక్‌తో మ్యాచ్, భారత్ ఫేవరేట్.. ఎందుకంటే

అడిలైడ్: మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇయాన్ చాపల్ తదితరులు భారత్‌నే ఫేవరేట్‌గా చెబుతున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల పదిహేనవ తేదీన (ఆదివారం) భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. దీని పైన పలువురు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ కంటే భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

భారత్ 1992, 1996, 1999, 2003, 2011 ప్రపంచ కప్‌లలో పాక్‌‍ను ఓడించింది. ఈసారి కూడా పాక్.. భారత్ పైన గెలవకపోవచ్చునని గవాస్కర్, చాపల్ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇరు జట్లు కూడా స్ట్రగుల్ ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

ఇటీవల న్యూజిలాండ్ చేతిలో పాక్ ఓడిందని, భారత్ కూడా ఇటీవల ప్రతిభ కనబర్చలేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో గత రికార్డులను పరిశీలిస్తే భారత్ వైపు మొగ్గు చూపవచ్చునని గవాస్కర్ అంటున్నారు. పాకిస్తాన్ 1992లో పాక్ ప్రపంచకప్ గెలిచిందని, ప్రస్తుతం జట్టులోని వారికి గెలిచిన అనుభవం లేదని, అదే భారత్‌లో ఉందని అభిప్రాయపడ్డారు.

Sunil Gavaskar, Ian Chappell tip India to beat Pakistan again in World Cup

అంతేకాకుండా, రెండు నెలలుగా భారత్.. ఆస్ట్రేలియాలో ఉండి వాతావరణానికి అలవాటుపడిపోయిందని చెబుతున్నారు. అడిలైడ్ టెస్టును చివరి దశలో ఓటమి చవి చూశారంటున్నారు. గత రికార్డులు, రెండు నెలలుగా ఆస్ట్రేలియాలోనే ఉండటం, ప్రపంచకప్ గెలిచిన అనుభవమున్న ఆటగాళ్లు ఉండటం.. తదితరాల నేపథ్యంలో భారత్ ఫేవరేట్ అంటున్నారు.

భారత్ పైన ఒత్తిడి ఎక్కువే

ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కంటే భారత్ పైన కూడా ఒకింత ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పవచ్చునని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. గత ప్రపంచకప్ మ్యాచులలో భారత్ ఎప్పుడు ఓడలేదని, దీంతో భారత్ పైనే కొంత ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పవచ్చునని చెప్పారు. అయితే, ఫేవరేట్ మాత్రం భారతే అన్నారు.

సచిన్ లేకపోవడంపై...

తొలిసారి సచిన్ టెండుల్కర్ ప్రపంచకప్‌లో లేకపోవడంపై లక్ష్మణ్ స్పందించారు. భారత్ సచిన్‌ను మిస్ అవుతోందని, అతను ప్రపంచకప్‌లలో మూడు మేన్ ఆఫ్ ది మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడని, అతను పాకిస్తాన్ పైన ఐదు ప్రపంచకప్‌లలో ఆడాడని గుర్తు చేశారు. అలాగే, సారథి ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పైన కూడా లక్ష్మణ్ స్పందించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+