న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొతెరాలోనే మనోళ్ల అరుదైన రికార్డులు.. గవాస్కర్ 10వేల పరుగులు, కపిల్ 432వ వికెట్!!

Sunil Gavaskar crossing 10k runs, Kapil Dev took 432 wicket in Motera stadium
Sachin's First Test Double Ton, Gavaskar 10k Test Runs, Kapil Dev 432 Test Wickets In Motera

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో గుజ‌రాత్‌లోని మొతెరా స్టేడియం నిలవనుంది. మొతెరాను స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం అని కూడా పిలుస్తారు. మొతెరా భారత దేశంలోని పురాతన స్టేడియాల్లో ఒకటి. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచనతో గుజరాత్ క్రికెట్ సంఘం ఐదేళ్ల కిందట మొతెరాను కూలగొట్టి కొత్తగా నిర్మించారు. దీని సీటింగ్ కెపాసిటీ ల‌క్షా ప‌ది వేలు. ప్రస్తుతం అతిపెద్ద స్టేడియం రికార్డు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ స్టేడియం పేరిట ఉంది. ఆ స్టేడియం కెపాసిటీ 90 వేలు. ఇప్పుడు అతిపెద్ద స్టేడియంగా మొతేరా నిలవనుంది.

<strong>ట్రంప్‌ ప్రసంగంలో క్రికెట్‌ ప్రస్తావన.. సచిన్‌, కోహ్లీల గురించి ఏమన్నారంటే?!!</strong>ట్రంప్‌ ప్రసంగంలో క్రికెట్‌ ప్రస్తావన.. సచిన్‌, కోహ్లీల గురించి ఏమన్నారంటే?!!

 10 వేల టెస్ట్ పరుగులు:

10 వేల టెస్ట్ పరుగులు:

మొతెరా స్టేడయం మన భారత దిగ్గజ మాజీలు సునిల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్‌లకు ఓ తీపి గుర్తుగా నిలిచింది. మొతెరా స్టేడయంలో గవాస్కర్ 10 వేల టెస్ట్ పరుగుల మార్కును ఇక్కడే అందుకున్నారు. 1987 మార్చి 7న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో గవాస్కర్ 10 వేల మార్కుని అందుకున్నారు. దీంతో టెస్టుల్లో 10 వేల టెస్ట్ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.

432వ వికెట్:

432వ వికెట్:

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన 432వ టెస్ట్ వికెట్ మొతెరా స్టేడయంలోనే సాధించారు. 432వ వికెట్ తీసి ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కపిల్ నిలిచారు. అప్పట్లో రిచర్డ్ హ్యాడ్లీ పేరిట ఉన్న రికార్డును కపిల్ దేవ్ అధిగమించారు. అంతే కాదు 1983లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఏకంగా 9 వికెట్లు ఈ మైదానంలోనే సాధించారు.

తొలిసారి డబుల్ సెంచరీ:

తొలిసారి డబుల్ సెంచరీ:

భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలోనే టెస్ట్ క్రికెట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేసుకున్నారు. అంతే కాదు న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి డబుల్ సెంచరీ చేయడం విశేషం. 2009 నవంబర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 20 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌ను ఇక్కడే పూర్తి చేసారు. ఇక 30,000 అంతర్జాతీయ పరుగులు కూడా ఇక్కడే సాధించారు.

 23 వన్డే మ్యాచ్‌లు:

23 వన్డే మ్యాచ్‌లు:

1982లో నిర్మితమైనప్పటి నుంచి ఈ స్టేడియంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. చివరి సారిగా డిసెంబర్ 2011 వరకు ఈ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఈ స్టేడియంను 2016లో మళ్లీ కొత్తగా నిర్మించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ప్రారంభం అయింది. మొత్తంగా 63 ఎకరాల స్థలాన్ని స్టేడియంను నిర్మించారు. ప్రస్తుతం ఈ స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చుని క్రికెట్ మ్యాచ్‌ను అస్వాదించవచ్చు. మొత్తంగా ఇందులో 76 కార్పొరేట్ బాక్సులు ఉండడం విశేషం. 4 డ్రెస్సింగ్ రూమ్‌లు, ఒలింపిక్ సైజులో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు.

Story first published: Monday, February 24, 2020, 16:34 [IST]
Other articles published on Feb 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X