Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా కాదు..అతని వల్లే భారత్‌కు వరల్డ్ కప్: సునీల్ గవాస్కర్

టీమిండియా విజయోత్సవ ర్యాలీ ఘనంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య, పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలివెళ్లారు. టీ20 వరల్డ్ కప్‌తో రోహిత్ సేన భారత గడ్డపై అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణం నెలకొంది. భారత జట్టుకు చరిత్రలో నిలిచేలా ఘన స్వాగతం లభించింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ బృందానికి అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు.

అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆటగాడి గురించి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. భారత్ విశ్వవిజేతగా నిలవడానికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా కంటే కెప్టెన్ రోహిత్ శర్మనే కారణమని వివరించాడు. టీ20 ప్రపంచకప్-2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు.

Sunil Gavaskar Chooses Rohit Sharma Over Jasprit Bumrah as India s Standout WC Performer Here s Why

అఫ్గానిస్థాన్ బౌలర్ ఫజుల్లా ఫరూకీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. తర్వాతి స్థానాన్ని అర్షదీప్ సింగ్, బుమ్రా ఉన్నారు. 8 మ్యాచ్‌ల్లో అర్షదీప్ 17, బుమ్రా 15 వికెట్లు పడగొట్టారు. మరోవైపు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 36 సగటుతో 257 పరుగులు చేశాడు. తొలి స్థానంలో అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ నిలిచాడు. అతను 35 సగటుతో 281 పరుగులు సాధించాడు.

అయితే రోహిత్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా సత్తాచాటాడని, జట్టును గొప్పగా నడిపించాడని గవాస్కర్ అన్నాడు. ''భారత్ అన్ని విభాగాల్లో ఛాంపియన్‌లా ప్రదర్శన చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డుకు అతడు అర్హుడే. కానీ అసలు షో నడిపించింది మాత్రం రోహిత్ శర్మ. రోహిత్ కెప్టెన్సీ గొప్పగా ఉంది. ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో అతను ఎక్కడా తగ్గలేదు''

''భారత్‌కు ప్రతికూలత పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు గొప్పగా వ్యవహరించాడు. అందుకే అతని అత్యుత్తమ ప్రశంసలు దక్కాలి. అందుకే టోర్నమెంట్‌లో భారత జట్టులో అతని కెప్టెన్సీనే నాకు అత్యుత్తమ ప్రదర్శన'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

Story first published: Friday, July 5, 2024, 12:22 [IST]
Other articles published on Jul 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+