దాదాను కొనియాడిన కోహ్లీ.. అసహనం వ్యక్తం చేసిన గవాస్కర్!!

కోల్‌కతా: ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు (తొలి డే/నైట్ టెస్టు)లో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే భారత జట్టు విజయానికి బీజం పోసింది బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడాడు. ఈ విషయంపై స్పందించిన భారత దిగ్గజం సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.

అప్పటికీ కోహ్లీ పుట్టలేదు:
తాజాగా గావస్కర్ మాట్లాడుతూ... 'డే/నైట్ అద్భుతమైన విజయం. జట్టులోని అందరూ బాగా ఆడారు. అయితే భారత జట్టు విజయ పరంపర 2000 నుంచి దాదా జట్టుతో మొదలైందని విరాట్ కోహ్లీ అన్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని తెలుసు. కాబట్టి దాదా గురించి కోహ్లీ బాగా మాట్లాడాడు. టీమిండియా 1970, 80ల్లోనే విజయాలను నమోదు చేసింది. అప్పటికీ కోహ్లీ పుట్టలేదు' అని అన్నాడు.

అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకున్నాం:
'2000ల్లోనే క్రికెట్ ప్రారంభమైందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. కానీ.. భారత జట్టు 70ల్లోనే విదేశాల్లో విజయాలు నమోదు చేసింది. 1986లోనూ గెలుపొందింది. అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకుంది. ఇతర జట్లలాగే ఓటమిపాలైంది' అని గావస్కర్ చెప్పుకొచ్చాడు

దూకుడు నేర్పిందే దాదా:
అంతకుముందు కోహ్లీ మాట్లాడుతూ... 'భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం. మ్యాచ్‌లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణం. టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం. దాన్ని ఎలా జయించాలో దాదా నుంచి నేర్చుకున్నాం' అని కోహ్లీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications