భారత్ vs వెస్టిండిస్: భువీ, బుమ్రాలకు విశ్రాంతిపై సన్నీ ఫైర్

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. వర్క్‌లోడ్ కారణంగానే వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు సెలక్టర్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
భువీ, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంపై టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో గవాస్కర్ మండిపడ్డాడు. "భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తమ దృష్టిలో టెస్టు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదని దీని ద్వారా సెలక్టర్లు చాటుకున్నారు. ఈ ఇద్దరు బౌలర్లూ తమకు విరామం కావాలని అడిగారా? నిజంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి దూరంగా ఉంచాల్సింది తప్ప టెస్టుల నుంచి కాదు" అని రాసుకొచ్చారు.

టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే
"టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కచ్చితంగా బరిలోకి దిగాలి. వారిద్దరి గైర్హాజరు వల్ల శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. తమ సత్తా ఏమిటో ప్రదర్శించి ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు ఖాయం చేసుకునేందుకు ఈ యువ పేసర్లకు ఇది మంచి అవకాశం" అని గవాస్కర్ వివరించారు.

విండిస్‌పై నాలుగు సెంచరీలు చేసిన అశ్విన్
"ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి నాలుగు టెస్టుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి భారత్ ఆ తర్వాత ఈ లెక్కను పక్కన పెట్టి చివరి టెస్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడింది. ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. మరోవైపు అశ్విన్ నాలుగు సెంచరీలు కూడా విండిస్‌పైనే చేశాడనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే మరోసారి భారత్ ఐదుగురు బౌలర్ల పాత వ్యూహాన్ని అమలు చేయవచ్చు" అని గవాస్కర్ తెలిపారు.

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియాకు కొత్త ఓపెనర్ల జోడీ
వెస్టిండిస్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా ఓపెనర్ల జోడీని మార్చబోతోంది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలలో ఎవరు ఒకరు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించనున్నారు. ఈ సిరిస్ సొంతగడ్డపై భారీ స్కోరు చేసేందుకు పుజారాకు ఇది మరో అవకాశంగా గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక, ఇంగ్లీషు గడ్డపై తిరుగులేని ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై విజృంభించే అవకాశం ఉంది.

చివరగా సచిన్ వీడ్కోలు సిరీస్‌కు వచ్చిన విండిస్
ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా... మళ్లీ టెస్టుల్లో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆ అవకాశం కల్పిస్తోంది. ఐదేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుకంటే ప్రస్తుత జట్టు చాలా పటిష్టంగా ఉండటం విశేషం. కొంత మంది టి20 స్టార్లు లేకపోయినా వెస్టిండీస్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. దీంతో ఈ సిరిస్ అంత సులువుగా ఏమీ జరగదనేది తన అభిప్రాయంగా గవాస్కర్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications