మ్యాచ్ రెఫరీలపై గవాస్కర్ మండిపాటు

హెడెన్ పట్ల జహీర్ ఖాన్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించి ఉంటే శిక్షార్హుడేనని, అయితే ఎల్లవేళలా భారత్ లేదా భారత ఉపఖండం ఆటగాళ్లకే శిక్షలు విధిస్తున్నారని, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అటువంటిదేమీ ఉండదని ఆయన బుధవారంనాడు అన్నారు. రెండో టెస్టులో చాలా సంఘటనలు జరిగాయని, రెండో ఇన్నింగ్సులో వీరేంద్ర సెహ్వాగ్ ను నాటవుట్ గా ప్రకటించారని, అయితే అంతటితో అది ముగిసిపోలేదని, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఎక్స్ ట్రా కవర్ నుంచి అంపైర్ వద్దకు వచ్చి మరీ మరీ అడగాడని ఆయన వివరించారు. అదే పని భారత ఆటగాడు చేసి ఉంటే సహించి ఉండేవారు కాదని, జరిమానా విధించి ఉండేవారని, ఈ విషయంలో ఐసిసి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మనుగా గవాస్కర్ మేలో తప్పుకున్న విషయం తెలిసిందే. జనవరిలో భారత ఆటగాళ్ల పట్ల ఐసిసి మ్యాచ్ రెఫరీ మైక్ ప్రొక్టర్ వివక్ష ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు.
Story first published: Wednesday, October 22, 2008, 16:31 [IST]
Other articles published on Oct 22, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications