Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunil Gavaskar's India Playing 11 vs Pak : డీకే వద్దు.. అశ్విన్ ముద్దు, పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌కు ఇండియా టీం

Sunil Gavasakars Indian Playing 11 vs Pakistan To Win In Asia Cup 2022

చిరకాల ప్రత్యర్థులయిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. అసలు సిసలు క్రికెట్ మజా అందించే ఈ ఇరు జట్లు ఆసియాకప్ టోర్నీలో భాగంగా తలపడ్డానికి రెడీ అయ్యాయి. ఆగస్టు 28న (ఆదివారం) దుబాయ్ స్టేడియం వేదికగా దాయాది దేశాల పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు ఎవరినీ తుది జట్లకు తీసుకుంటాయనేదానిపై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఎవరినీ తుదిజట్టులోకి తీసుకోవాలో కూడా ప్రెడిక్ట్ చేశాడు. తన ప్లేయింగ్ 11లో ఆశ్చర్యకరంగా ముగ్గురు స్పిన్నర్లను తీసుకున్నాడు.

ఓపెనర్లుగా వీరు..

ఓపెనర్లుగా వీరు..

ఇక సునీల్ గవాస్కర్ పేర్కొన్న 11 మంది లిస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీంతో వీరిలో ఎవరైన ఇద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశముంది. ఇక సూర్య, రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలిగే సిద్ధహస్తులే. సునీల్ గవాస్కర్ ప్రత్యేకంగా వీరిద్దరిలో ఎవరినీ ఓపెనర్లుగా బరిలోకి దిగాలనే విషయం ప్రస్తావించలేదు.. కానీ గతంలో అతను చేసిన వ్యాఖ్యలను బట్టి.. రోహిత్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే పాత్రను పోషిస్తారు.

మిడిలార్డర్‌లో వీరు

మిడిలార్డర్‌లో వీరు

ఇక ఫస్ట్‌డౌన్ బ్యాటర్‌గా పేలవ ఫాంలో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీకి తన ప్లేయింగ్ 11లిస్టులో సన్నీ చోటు కల్పించాడు. కోహ్లీ నంబర్ 3 బ్యాటర్‌గా ఆడటం దాదాపు ఖాయం. ఇక నంబర్ 4 బ్యాటర్‌గా ఓపెనర్లు ఎవరు దిగుతారనే విషయమై ఆధారపడి ఉంటుంది.. రాహుల్ ఓపెనింగ్ దిగితే సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బరిలోకి దిగొచ్చు. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్‌ను గవాస్కర్ పేర్కొన్నాడు.

ఆల్రౌండర్లుగా వీరు

ఆల్రౌండర్లుగా వీరు

ఇక ఎప్పటిలాగే 6వ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దిగాలని తన ప్లేయింగ్ 11 లిస్టు ద్వారా సన్నీ చెప్పేశాడు. మరో ఆల్రౌండర్‌గా రవీంద్రా జడేజాకు చోటిచ్చాడు. వీరిద్దరిని తీసుకోవడంతో దినేష్ కార్తీక్ స్థానం గల్లంతయింది. భారత స్టార్ ఫినిషర్ అని పేరున్న దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటు దక్కే వీలు లేకుండా పోయింది. కార్తీక్‌ను తీసుకోవాలంటే ఒక బౌలర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది.. అందువల్ల అతన్ని తన ప్లేయింగ్ 11లో గవాస్కర్ పేర్కొనలేదు.

బౌలర్లుగా వీరు

బౌలర్లుగా వీరు

సునీల్ గవాస్కర్ జట్టులో ముగ్గురు స్పిన్నర్ల ఆవశ్యకత ఉందనే అవసరాన్ని గుర్తించాడు. అందువల్ల అశ్విన్, చాహల్‌లను తుది జట్టులో ఉంచాలని సూచించాడు. దీంతో జడేజా, అశ్విన్, చాహల్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. తద్వారా మిగిలిన రెండు స్లాట్లలో ఇద్దరు స్పెషలిస్టు పేసర్లయిన భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లను తీసుకున్నాడు. దీంతో అవేశ్ ఖాన్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశముందని చెప్పకనే చెప్పేశాడు. ఇక సన్నీ ప్రకటించిన లిస్టు ప్రకారం.. దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ బెంచ్ మీద కూర్చోనున్నారు.

సునీల్ గవాస్కర్ పేర్కొన్న భారత తుది జట్టు

సునీల్ గవాస్కర్ పేర్కొన్న భారత తుది జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

బెంచ్ ప్లేయర్లు : దినేష్ కార్తీక్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా

Story first published: Friday, August 26, 2022, 14:35 [IST]
Other articles published on Aug 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+