న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాకు ''గాడ్ ఆఫ్ క్రికెట్'' మాత్రం ధోనీనే'

Suniel Shetty Touts This Player as God of Cricket & it is Not Sachin Tendulkar

ముంబై: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ని అందరూ 'గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌' అని సంభోదిస్తుంటే.. తనకు మాత్రం గాడ్ ఆఫ్ క్రికెట్ ఎంఎస్ ధోనీయేనని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. శనివారం సునీల్‌ తన పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఎంతో ఇష్టమైన ధోనీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. క్రికెట్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఐపీఎల్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

'ధోనీ ఎప్పటికీ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వకూడదు. ఆయన రిటైర్‌ అయినప్పటికీ గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ధోనీనే. ఆయన ఖ్యాతి మరింత పెరుగుతుంది. మరికొన్నేళ్లలో ధోనీ రిటైర్‌ అవుతున్నారని తెలిసి నాకు చాలా బాధగా అనిపించింది. భారత్‌ తరఫు ధోనీ ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌గా ధోనీకి ఉన్న ముందుచూపు ఇంకెవ్వరికీ లేదు. మీరు వేలాది మంది కెప్టెన్లను వెతికినా..ధోనీ సరైన సమయంలో సరైన వ్యక్తిని కెప్టెన్‌గా ఎంపికచేయగల సామర్థ్యం ఉన్నవాడు.' అని వెల్లడించారు సునీల్‌.

ఇప్పటికే ధోనీ టెస్టు ఫార్మాట్‌లో ఆడేది లేదంటూ విరామం ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లాండ్‌తో ఆడుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. చివరిగా 'దో చెహరే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్‌ ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న 'భారత్‌' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో సునీల్ శెట్టి పుట్టినరోజు వేడుకలలో సచిన్ టెండూల్కర్ ముంబైలో కలిశాడు. వీరిద్దరూ కలిసిన సమయంలో తీసుకున్న ఫొటోను సచిన్ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దాని కింద 'పుట్టినరోజుకు నీతో కలిసి గడపడం చాలా సంతోషంగా ఉంది. హ్యపీ బర్త్ డే సునీల్ శెట్టి' అంటూ సచిన్ తన శుభాకాంక్షలు కూడా అందజేశాడు.

Story first published: Monday, August 13, 2018, 11:50 [IST]
Other articles published on Aug 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X